బ్యాక్టీరియా నుంచీ కార్బన్‌డయాక్సైడ్‌
close

Published : 02/06/2021 00:50 IST
బ్యాక్టీరియా నుంచీ కార్బన్‌డయాక్సైడ్‌

భూ తాపానికి, వాతావరణ మార్పులకు ముఖ్య కారణం పర్యావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ నానాటికీ పెరిగిపోవటం. ఇందుకు సముద్రం లోతుల్లో ఉండే ఒక బ్యాక్టీరియా కూడా కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధన పేర్కొంటోంది. ఈ బ్యాక్టీరియా సముద్రంలో కర్బనంతో కూడిన రాళ్లను కరిగిస్తోందని బయటపడింది మరి. గంధకాన్ని శక్తి వనరుగా వినియోగించుకునే ఈ సూక్ష్మజీవులు సముద్రం అడుగున మీథేన్‌ వాయువును వెలువరించే రాళ్ల మీద నివసిస్తుంటాయి. గంధకాన్ని వినియోగించుకునే క్రమంలో సూక్ష్మజీవులు ఆమ్ల చర్యను సృష్టిస్తున్నట్టు, ఇది రాళ్లు కరగటానికి దోహదం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీని మూలంగానే రాళ్లలోని కర్బనం సముద్రంలోకి చేరుతోంది. సముద్రంలోకి కర్బనం విడుదలైతే అక్కడితోనే ఆగిపోదు. అది పర్యావరణంలోకీ చేరుతుంది. ఎందుకంటే సముద్రం, పర్యావరణం నిరంతరం వాయువులను బదిలీ చేసుకుంటుంటాయి. మన గ్రహం మీద మూలకాల చట్రంలో సూక్ష్మజీవుల పాత్రను మరింత బాగా అర్థం చేసుకోవటానికి,  ప్రపంచ వ్యాప్తంగా కార్బన్‌డయాక్సైడ్‌ పరిమాణాన్ని తెలుసుకోటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న