పారేసిన సర్జికల్‌ మాస్కులేమవుతాయి?
close

Updated : 30/06/2021 06:33 IST
పారేసిన సర్జికల్‌ మాస్కులేమవుతాయి?

కసారి మాత్రమే వాడుకునే వీలుగల సర్జికల్‌ మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారా? ఇవి పర్యావరణానికి, వన్యప్రాణులకు హాని చేస్తాయని మీకు తెలుసా? సర్జికల్‌ మాస్కులను థర్మోప్లాస్టిక్‌ పాలీప్రొపైలేన్‌తో తయారుచేస్తారు. వాడి పారేసిన తర్వాత ఇవి చాలావరకు చెత్తకుప్పల్లోకి, అక్కడ్నుంచి కాలువలు, నదుల ద్వారా సముద్రాల్లోకి చేరుకుంటాయి. ఒకసారి సముద్రాల్లోకి చేరుకుంటే మాస్కుల్లోని ప్లాస్టిక్‌ 450 సంవత్సరాల వరకు అలాగే ఉండిపోతుంది. క్రమంగా ప్లాస్టిక్‌ క్షీణిస్తూ జలాల్లో కలుస్తుంది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్‌ను చేపల వంటి సముద్రజీవులు తింటాయి. వాటి నుంచి చివరికి ఆహారం రూపంలో మన శరీరంలోకే చేరుతుంది. కాబట్టి సర్జికల్‌ మాస్కులను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా టిష్యూ కాగితంలో చుట్టి చెత్తబుట్టలో వేయటం మంచిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న