జీవులకు నీరెందుకు?
close

Updated : 25/08/2021 00:38 IST
జీవులకు నీరెందుకు?

మస్త ప్రాణికోటి మనుగడకు నీరు తప్పనిసరి. ఎందుకు? నీరు లేకపోతే ప్రాణులు ఎందుకు జీవించలేవు? దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా నీటి విశిష్ట రసాయన గుణాల మీద ఆధారపడినవే. మన కణాల్లో వేలాది రసాయన ప్రతిచర్యలు జరుగుతుంటాయి. ఇవి వేగంగా, సమర్థంగా జరగాలంటే రసాయనాలు ఏదో ఒకదాంట్లో కరగాల్సిన అవసరముంది. ఇక్కడే నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది సార్వత్రిక ద్రావణం. పదార్థాలను కరిగించుకోవటంలో దీన్ని మించింది లేదు. నీరు మాదిరిగా కరిగించుకునే శక్తి గల ఇతర పదార్థాలు లేకపోలేదు. అయితే నీరులాంటి రసాయన స్థిరత్వం వాటికి లేదు. గాఢమైన ఆమ్లాలను నిర్వీర్యం చేసే సామర్థ్యం లేదు. కాబట్టే అన్ని ప్రాణులకు నీరు శరణ్యంగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న