Squid Game: జాగ్రత్త సుమా.. ఆ గేమ్‌ యాప్‌ల జోలికెళితే ఖాతాలు ఖాళీ!  
close

Published : 25/10/2021 23:40 IST

Squid Game: జాగ్రత్త సుమా.. ఆ గేమ్‌ యాప్‌ల జోలికెళితే ఖాతాలు ఖాళీ!  

ఇంటర్నెట్‌డెస్క్‌: స్క్విడ్ గేమ్‌.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సిరీస్‌. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ గత కొంతకాలంగా నెం.1 స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో ఎన్నో రకాల యాప్‌లు, గేమ్‌లు రూపుదిద్దుకున్నాయి. అయితే ఇప్పుడు ఇవే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారాయి. ఈ వెబ్‌సిరీస్‌ ఆధారంగా రూపుదిద్దుకున్న యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను పంపి యూజర్‌ డేటా దొంగిలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది యూజర్స్‌ గూగుల్ ప్లేస్టోర్ నుంచి స్క్విడ్‌ గేమ్ ఆధారంగా రూపుదిద్దుకున్న యాప్‌లు, గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో గూగుల్ ఈ గేమ్‌ థీమ్‌తో ఉన్న యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించడం ప్రారంభించింది. ఇటీవలే ‘స్వ్కిడ్‌ గేమ్‌ వాల్‌పేపర్‌ 4కే హెచ్‌డీ’ అనే యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ తొలగించింది. ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్స్‌ ఎస్సెమ్మెస్‌ సాయంతో ఏపీకే పేలోడ్స్‌ని పంపి వారి బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు సైబర్‌ రీసెర్చర్ల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని గూగుల్ తెలిపింది. 

స్క్విడ్‌ థీమ్‌తో రూపొందిన 200పైగా యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. వీటి ద్వారా హ్యాకర్స్‌ జోకర్‌ మాల్‌వేర్‌ను యూజర్స్‌ మొబైల్‌లోకి పంపి వారి డేటా సేకరించడంతోపాటు, యూజర్‌ అనుమతి లేకుండా ఖరీదైన సేవలను అందించే సర్వీసులకు సబ్‌స్క్రైబ్‌ చేస్తున్నట్లు లూకాస్‌ స్టెఫానో అనే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించాడు. యూజర్స్‌ ఇలాంటి యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్క్విడ్ గేమ్‌ థీమ్‌ లేదా ఆ పేరుతో ఉన్న ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని గూగుల్ సూచించింది. ఒకవేళ యూజర్స్ ఎవరైనా తమ మొబైళ్లలో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే తొలగించాలని కోరింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న