Jio Phone: జియో, నోకియా ఫీచర్‌ఫోన్‌లో నిలిచిపోనున్న వాయిస్‌ అసిస్టెంట్ సేవలు 
close

Published : 02/09/2021 21:34 IST
Jio Phone: జియో, నోకియా ఫీచర్‌ఫోన్‌లో నిలిచిపోనున్న వాయిస్‌ అసిస్టెంట్ సేవలు 

ఇంటర్నెట్‌డెస్క్‌: జియోఫోన్ రాకతో కై ఓఎస్‌కి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అంతకముందు కేవలం నోకియా, శాంసంగ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫీచర్‌ఫోన్ల తయారీదారులు ఈ ఓఎస్‌ను ఉపయోగించేవారు. కాలక్రమంలో శాంసంగ్ పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై దృష్టి సారించింది. తర్వాత జియో, నోకియా కంపెనీలే ఎక్కువగా ఫీచర్‌ఫోన్లలను ఉత్పత్తి చేస్తున్నాయి. పేరుకి ఫీచర్‌ఫోన్లే అయినప్పటికీ వీటిలో కూడా వాట్సాప్‌ మెసేజింగ్, వెబ్‌ బ్రౌజింగ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌, గూగుల్ మ్యాప్స్‌, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఫీచర్‌ఫోన్లకు భారత్‌ సహా పలు దేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. తాజాగా కై ఓఎస్‌లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సేవలు పీచర్‌ఫోన్లలో నిలిచిపోనున్నాయి. గతంలోలా యూజర్స్‌ వాయిస్‌ కమాండ్స్‌తో టెక్ట్స్‌ మెసేజింగ్, కాలింగ్ చేయలేరు. ఈ రెండు ఫీచర్స్‌ మినహా మిగిలిన అన్ని ఫీచర్లు యూజర్‌కి అందుబాటులో ఉంటాయని టెక్ నిపుణులు వెల్లడించారు. అంటే వాల్యూమ్ కంట్రోల్‌, యాప్స్‌ ఓపెన్ చేయడం, యూట్యూబ్ వీడియోస్‌ ప్లే చేయడంతోపాటు గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్‌ వంటి ఫీచర్లను గూగుల్‌ అసిస్టెంట్‌తో పొందొచ్చు. 

గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్ సేవలకు సంబంధించి ఇటీవలే గూగుల్ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఫీచర్ ఫోన్లలో గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్ సేవలపై పరిమితులు విధించింది. దీంతో జియో, నోకియా ఫీచర్‌ఫోన్లలో మాత్రమే ఈ సేవలు నిలిచిపోనున్నాయి. త్వరలో జియో విడుదల చేయనున్న జియో ఫోన్‌ నెక్ట్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. జియో ఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ లైట్ వెర్షన్ ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ తాజా నిర్ణయంతో జియో ఫోన్ నెక్ట్స్ యూజర్స్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న