గూగుల్ మీట్‌లో ‘ప్రివ్యూ’ ఫీచర్‌
close

Published : 04/02/2021 23:53 IST

గూగుల్ మీట్‌లో ‘ప్రివ్యూ’ ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రీన్ రూం పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్‌ మీటింగ్‌లో పాల్గొనే ముందే తమ ప్రివ్యూ చూసుకోవచ్చు. అంటే వీడియో కాల్‌లో ఆడియో సరిగ్గా వినబడుతుందా? వీడియోలో సరిగా కనిపిస్తున్నామా? వీడియోకు సరిపోయినంత లైటింగ్ ఉందా, కెమెరాకి ఎంత దూరంలో ఉన్నాం, నెట్‌వర్క్‌ కనెక్షన్‌ సరిగా ఉందా? లేదా? వంటివి వీడియో కాల్‌ ప్రారంభించే ముందుగానే సరిచూసుకోవచ్చు.

గతంలో ఇవేవి చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది కాదు. దీని వల్ల ఆన్‌లైన్‌ మీటింగ్ ప్రారంభమవగానే వాటిలో మార్పులు చేయడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉండేది. ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్‌ వీడియో కాల్ క్వాలిటీని యూజర్స్ ముందుగానే చెక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఒక వేళ మీ కాలింగ్ క్వాలిటీలో ఏదైనా సమస్య ఉంటే దానిని తెలియజేస్తూ విండో మీద మీకో పాప్‌-అప్ మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. ఈ ఫీచర్ కోసం యూజర్స్‌ మీటింగ్ ప్రారంభించే ముందు ‘చెక్‌ యువర్‌ ఆడియో అండ్ వీడియో’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పాప్‌-అప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అందులో వీడియో, ఆడియో, స్పీకర్, మైక్రోఫోన్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్‌ చేసి చెక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఎంటర్‌ప్రైజ్, ప్రీమియం ఖాతా దారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. త్వరలోనే ఉచితంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.  

ఇవీ చదవండి..

గూగుల్ కొత్త ఫీచర్స్.. ఇక మ్యాప్స్‌ ప్రాంతీయం

వాట్సాప్‌ టు టెలిగ్రాం..చాట్ హిస్టరీ మార్చేయండిలా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న