గెలాక్సీ A 12 వచ్చింది.. గూగుల్‌ పిక్సెల్‌ 6 త్వరలో
close

Published : 21/02/2021 16:35 IST
గెలాక్సీ A 12 వచ్చింది.. గూగుల్‌ పిక్సెల్‌ 6 త్వరలో

ఇంటర్నెట్‌ డెస్క్‌: హై ఎండ్ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు గూగుల్‌ పిక్సెల్‌ పేరుతో ఐదు ప్రధాన మోడళ్లను గూగుల్‌ తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 5‌ను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా గూగుల్‌ పిక్సెల్‌ 6ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ మొబైల్‌ లాంచ్‌ ఉండొచ్చనే అంచనా వేస్తున్నాయి. గూగుల్‌ పిక్సెల్‌ 6 స్పెసిఫికేషన్స్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ రూమర్ల ప్రకారం... 

ప్రత్యేకతలు

* క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ * 5G సపోర్ట్‌ * 6 అంగుళాల స్క్రీన్‌ డిస్‌ప్లే * 4000 mAh బ్యాటరీ * ధర: దాదాపు రూ.60 వేలు (అంచనా)


మిడ్‌ రేంజ్‌ నుంచి హై ఎండ్‌ శ్రేణి వినియోగదారుల కోసం శాం‌సంగ్‌ ఎక్కువగా మోడళ్లను విడుదల చేస్తుంటుంది. గెలాక్సీ A సిరీస్‌లో కొత్తగా A12 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

శామ్‌సంగ్‌ గెలాక్సీ A12 ఫీచర్లు
* ప్రాసెసర్‌: 1.8GHz ఆక్టాకోర్ మీడియాటెక్‌ P35 * బ్యాటరీ: 5000 mAh * డిస్‌ప్లే: 6.50 అంగుళాలు * రేర్‌ కెమెరా: 48 మెగాపిక్సెల్‌+5+2+2 * ఫ్రంట్‌ కెమెరా: 8 మెగా పిక్సెల్‌ * ధరలు 4 జీబీ ర్యామ్‌+64 జీబీ: రూ.12,999, 4జీబీ ర్యామ్‌+128 జీబీ: రూ.13,999


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న