Google Search: ఇకపై గూగుల్‌.. ప్రతిరోజూ ఓ కొత్త పదం నేర్పిస్తుంది!
close

Published : 22/10/2021 23:52 IST

Google Search: ఇకపై గూగుల్‌.. ప్రతిరోజూ ఓ కొత్త పదం నేర్పిస్తుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌.. మనందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఎంతలా అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే అరచేతిలో ఉండే మొబైల్‌లో గూగుల్‌ సెర్చ్‌ చేస్తే చాలు.. కావాల్సిన వివరాలు సెకన్లలో మన ముందు ప్రత్యక్షమవుతాయి. అంతలా మనతో మమేకమైన గూగుల్‌.. ఇప్పుడు మరో ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇక పై గూగుల్‌ ఓ ఇంగ్లిష్‌ టీచర్‌లా కూడా మారనుంది. ప్రతిరోజూ ఓ కొత్త ఇంగ్లిష్‌ పదం నేర్పనుంది. ఇందుకోసం ఓ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. తద్వారా యూజర్లు తమ పద సంపదను, భాషా నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

కొత్తపదం ఎలా నేర్చుకోవచ్చంటే..
ముందుగా గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లండి. ఉదాహరణకు (serendipity) అర్థం తెలుసుకోవాలనుకుంటున్నట్లైతే.. గూగుల్‌ సెర్చ్‌లో serendipity అని టైప్‌ చేయండి. ఆపై సెర్చ్‌ చేశాక.. టాప్‌ కార్నర్‌లో కుడివైపు కనిపించే బెల్‌ ఐకాన్‌పై నొక్కండి. అలా నొక్కినప్పటి నుంచి ప్రతిరోజూ కొత్తపదాలు మీ మొబైల్‌లో కనిపించేలా నొటిఫికేషన్‌ ఒకటి వస్తుంది. అలా మీకు కావాల్సిన
 కొత్త పదాలు, వాటి అర్థాలు, ఆ పదం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చన్నమాట.

ఈ పదానికి అర్థం ఎక్కువగా వెతికారట
గూగుల్‌ ట్రెండ్స్‌ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ‘introvert’, ‘integrity’ అనే పదాలను ఎక్కువగా వెతికారట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఫీచర్‌ని ప్రవేశపెట్టాలని భావించినట్లు గూగుల్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సదుపాయం ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఫీచర్‌ కేవలం మొబైల్స్‌కి మాత్రమే పరిమితం చేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న