Google Pixel 6: గూగుల్ పిక్సెల్‌ 6 కొత్త అప్‌డేట్.. విడుదల ఎప్పుడంటే?
close

Published : 09/09/2021 23:58 IST
Google Pixel 6: గూగుల్ పిక్సెల్‌ 6 కొత్త అప్‌డేట్.. విడుదల ఎప్పుడంటే?

(Photo Credit: Google)

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్ కొత్త ఫోన్ పిక్సెల్ 6కి సంబంధించి ఫీచర్లు గత కొంతకాలంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా గూగుల్ పిక్సెల్‌ 6కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అలానే పిక్సెల్‌ 6కి సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పిక్సెల్‌ 6 ప్రో మోడల్‌లో 6.7 అంగుళాలు, పిక్సెల్‌ 6 మోడల్‌లో 6.4 అంగుళాల పంచ్‌హోల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. పిక్సెల్‌ 6 ఫొటోలను బట్టి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. అలానే ఇన్‌స్టాగ్రాంలోని ఫొటోల ఆధారంగా ఈ ఫోన్‌ అక్టోబరు 19న 9:30 గంటలకు విడుదల చేయనున్నట్లు టెక్‌ వర్గాల అంచనా. ఇందులో గూగుల్ సొంతంగా రూపొందించిన టెన్సర్ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఇస్తున్నారట. 8జీబీ ర్యామ్‌/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా గత ఫోన్లతో పోలిస్తే పిక్సెల్‌ 6లో డిజైన్‌, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేసినట్లు సమాచారం.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న