Google Assistant: గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త కమాండ్
close

Published : 24/09/2021 23:42 IST

Google Assistant: గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త కమాండ్

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ‘హేయ్ గూగుల్’ లేదా ‘ఓకే గూగుల్’ అనగానే చిన్న శబ్దంతో మీకు సేవలందించేందుకు వాయిస్‌ అసిస్టెంట్ రెడీ అయిపోతుంది. మీరు ఇచ్చిన కమాండ్ ఆధారంగా మీకు కావాల్సిన సేవలను అందిస్తుంది. తాజాగా ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ కమాండ్‌లో కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది గూగుల్.

ఫోన్‌లో మనం చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితా రిమైండర్ పెట్టుకుంటాం. ఇప్పడు అదే రిమైండర్‌ని గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు. ‘హేయ్‌ గూగుల్ ఓపెన్‌ మై రిమైండర్స్‌’ అని కమాండ్‌ ఇస్తే చాలు.. మీ రిమైండర్‌ జాబితా మీ ముందుంటుంది. అలానే ప్రతి రిమైండర్‌కి సంబంధించిన వివరాలు తేదీ, టైంతో సహా కనిపిస్తాయి. అలానే వాటిలో ఏవైనా మార్పులు చేయాలన్నా సదరు రిమైండర్‌ పక్కనే ఉన్న సెట్టింగ్స్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలానే సులువుగా కొత్త రిమైండర్‌ క్రియేట్ చేసేందుకు వీలుగా గూగుల్ అసిస్టెంట్ రిమైండర్‌ హబ్‌లో కుడివైపు పైభాగంలో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఇస్తున్నారు. అక్కడ మీరు కొత్త రిమైండర్‌ క్రియేట్ చేసిన వెంటనే అది గూగుల్ క్యాలెండర్‌తో సింక్‌ అవుతుంది. రిమైండర్‌ హబ్‌తోపాటు వాయిస్‌ అసిస్టెంట్‌లో గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దాంతో మీరు సులువుగా గ్యాస్‌ బిల్లు చెల్లించొచ్చు. ఈ ఫీచర్‌ కోసం ‘హేయ్‌ గూగుల్ పే ఫర్ గ్యాస్‌’ అని కమాండ్ ఇచ్చి మీ డీలర్‌ను ఎంపిక చేసి గూగుల్ పే నుంచి చెల్లింపులు పూర్తి చేయొచ్చు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న