ప్రభుత్వ పథకాల కోసం ఓ ‘అసిస్టెంట్‌’
close

Published : 04/01/2021 21:49 IST

ప్రభుత్వ పథకాల కోసం ఓ ‘అసిస్టెంట్‌’

 

ఇంటర్నెట్‌ డెస్క్: ఈ-గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అమెజాన్‌ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ తరహాలో కొత్త వాయిస్‌ అసిస్టెంట్‌/ఛాట్‌ బోట్‌ ఫ్లాట్‌ఫామ్‌ని అభివృద్ధి చేయనుంది. ఈ కొత్త వాయిస్‌ అసిస్టెంట్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో పనిచేస్తుంది. అంతేకాకుండా వివిధ భాషల్లో ప్రజలతో సంభాషిస్తుంది. దీన్ని ఉపయోగించే వారి మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషించి తగు సూచనలు చేస్తుంది. దీని అభివృద్ధి కోసం కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ పరిధిలోని జాతీయ ఈ-గవర్నెస్‌ డివిజన్‌ (ఎన్‌ఈజీడీ) బిడ్లను ఆహ్వానించింది.

అలానే ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ను వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సేవలను అందించే ఉమాంగ్‌ ఫ్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసే విధంగా రూపొందించనున్నారు. ఈ కొత్త ఛాట్‌బోట్‌లో టెక్ట్స్‌ను స్పీచ్‌గా, స్పీచ్‌ను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ ఉంటుందట. అలానే ఇందులో కొత్త పథకాలు, సేవలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారులు సరైన పథకాలు పొందేలా సూచనలు చేసేలా దీన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 12 తేదీ నుంచి జనవరి 25 తేదీ వరకు బిడ్లు దాఖలు చెయొచ్చు. ఫిబ్రవరి రెండో వారంలో దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ముగించనున్నట్లు ఎన్‌ఈజీడీ తెలిపింది. 

ఇవీ చదవండి..

పోల్‌: 2021లో  మొబైల్స్‌ ఎలా ఉండాలి?

మీ ఫోన్‌ నుంచి మెసేజ్‌లు వెళ్లడం లేదా... 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న