జీమెయిల్‌ మీ నుంచి ఏం తీసుకుంటుందంటే?
close

Published : 23/02/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జీమెయిల్‌ మీ నుంచి ఏం తీసుకుంటుందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్: సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక... గోప్యత (ప్రైవసీ) ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. యాప్‌ వినియోగంలో మెరుగైన సేవలు అందిస్తామని చాలా సంస్థలు వినియోగదారుల నుంచి వివరాలు తీసుకుంటున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ డేటా లీకేజీ, అనధికారిక వినియోగాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ తన వినియోగదారుల నుంచి ఏ డేటా తీసుకుంటోంది అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా గూగుల్‌ ఆ వివరాలను వెల్లడించింది. ఐఓఎస్‌లో జీమెయిల్‌ యాప్‌ వినియోగించేటప్పుడు  తీసుకుంటున్న వివరాలను ప్రకటించింది.

గతేడాది ఆఖరులో యాప్‌ స్టోర్‌... ప్రైవసీ ల్యాబ్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అందులో భాగంగా వినియోగదారుడి నుంచి ఏయే వివరాలు సేకరిస్తున్నారో ప్రతి యాప్‌ కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలా ఇప్పుడు జీమెయిల్‌కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇవి ఐఓఎస్‌ వివరాలే అయినప్పటికీ.. పాలసీలు ఒకేలా ఉన్న కారణంగా ఆండ్రాయిడ్‌లోనూ జీమెయిల్‌ ఇవే వివరాలు తీసుకుంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే జీమెయిల్‌ బిజినెస్‌ అకౌంట్‌ విషయంలో  ఈ లెక్క వేరుగా ఉంటుందట.

జీమెయిల్‌ యాప్‌ నిర్వహణకు వినియోగదారుని పేరు, లొకేషన్‌, మెయిల్‌ అడ్రెస్‌, ఈమెయిల్స్‌, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో డేటా, యూజర్‌ సమాచారం, సెర్చ్‌ సమాచారం, యూజర్‌ ఐడీ, డివైజ్‌ ఐడీ, యూసేజ్‌ డేటా, అడ్వర్టైజింగ్‌ డేటా, క్రాష్ డేటా, పర్‌ఫార్మెన్స్‌ డేటాను సంగ్రహిస్తుంది. ఇక అనలిటిక్స్‌ కోసం... మీరు కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు, కాంటాక్ట్‌ సమాచారం, ఈమెయిల్‌  అడ్రెస్‌, ఫొటోలు, వీడియోలు, ఆడియో వివరాలు, ఇతర కంటెంట్‌, సెర్చ్‌ సమాచారం, యూజర్‌ ఐడీ, డివైజ్‌ ఐడీ, యూసేజ్‌ డేటా, అడ్వర్టైజింగ్‌ డేటా, క్రాష్‌ డేటా, పర్‌ఫార్మెన్స్‌ డేటాను జీమెయిల్‌ సేకరిస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు