WWDC2021: యాపిల్‌ ‘కొత్త’ ముచ్చట్లు
close

Updated : 08/06/2021 19:07 IST
WWDC2021: యాపిల్‌ ‘కొత్త’ ముచ్చట్లు

యాపిల్‌ తన డివైజ్‌ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో తీసుకొచ్చే కొత్త ఫీచర్లను వివరించడానికి  ఏటా వరల్డ్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ ( WWDC) నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది WWDCలో ఐవోఎస్‌ 15, ఐప్యాడ్‌ ఓఎస్‌, వాచ్‌ ఓఎస్‌, మాస్‌ ఓఎస్‌ మాంటిరే గురించి వివరించారు.ఈ ఓఎస్‌ల డెవలపర్‌ బీటా వెర్షన్‌ను విడుదల చేసేశారు. పబ్లిక్‌ బీటా వెర్షన్లను వచ్చేనెల విడుదల చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం... 


ఐవోఎస్‌ 15 వివరాలు... 

యాపిల్‌ మొబైల్స్‌ కోసం కొత్తగా ఐవోఎస్‌ 15ను సంస్థ అనౌన్స్‌  చేసింది. ఫేస్‌టైమ్‌ను సర్వీసును సరికొత్తగా మార్చనున్నారు. జూమ్‌ తరహాలో  బ్లర్‌ బ్యాగ్రౌండ్స్‌, పోర్‌ట్రైట్‌ మోడ్‌, గ్రిడ్‌ వ్యూ లాంటి ఫీచర్లు తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇండివిడ్యువల్‌ ఫేస్‌టైమ్‌ కాల్స్‌ను షెడ్యూల్‌ చేసే ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఫేస్‌ టైమ్‌ త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే విండోస్‌ వినియోగదారుల కోసం బ్రౌజర్‌ కంపాటబిలిటీ కూడా ఇస్తున్నారు. 

ఐమెసేజ్‌ యాప్‌లో షేర్‌డ్‌ విత్‌ యూ అనే కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నారు. ఐమెసేజ్‌ ద్వారా  యూజర్లకు వచ్చిన లింక్‌లను ఆయా పేర్లతో ఒక దగ్గర సేవ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు  యూజర్‌ డోంట్‌ డిస్ట్రబ్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకున్నా... ఆ వ్యక్తికి మెసేజ్‌ వచ్చినట్లు తెలిసేలా కొత్త ఓఎస్‌లో చేయొచ్చు. 

యాక్టివిటీ ఆధారంగా నోటిఫికేషన్స్‌ విభాగం పని చేస్తుంది. ఫోకస్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌... మీ స్టేటస్‌ ఆధారంగా  నోటిఫికేషన్‌ ప్రిఫరెన్స్‌ను మారుస్తుంది. అంటే యూజర్‌ డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌ మారిపోతాయి. అలా వర్కింగ్‌, వాకింగ్‌ అనే స్టేటస్‌లు కూడా ఇస్తారు. అయితే స్టేటస్‌ను యూజర్‌ మొబైల్‌లో మార్చుకోవాలి. 

కెమెరాలో  కొత్తగా లైవ్‌ టెక్స్ట్‌ ఆటోమేటిక్‌ స్కాన్‌  అనే ఫీచర్‌ తెస్తున్నారు. గూగుల్‌ లెన్స్‌ తరహాలో ఇది పని చేస్తుంది. దీంతోపాటు మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా ఫొటోలను ఆటోమేటిక్‌గా గ్యాలరీ చేసి పెడుతుంది. 

యాపిల్‌ మ్యాప్స్‌లో త్రీడీ డేటాను యాడ్‌ చేస్తున్నారు. దీంతో మరిన్ని నగరాలకు చెందిన మ్యాప్స్‌లో  అదనపు వివరాలు లభిస్తాయి.  దీంతోపాటు యూవీ ఇండెక్స్‌, గాలి వీచే వేగం, బ్యాగ్రౌండ్స్‌ మార్పు, నైట్‌టైమ్‌ మోడ్‌ లాంటి ఫీచర్ల యాడ్‌ చేస్తున్నారు. 


మ్యాక్‌ మాంటరే... 

మ్యాక్‌ ఓఎస్‌కు కొత్త వెర్షన్‌ను యాపిల్‌ అనౌన్స్‌ చేసింది. దాని పేరు మాంటరే. కాలిఫోర్నియా సెంట్రల్‌ కోస్ట్‌లో ఉన్న బీచ్‌ పేరు ఇది. యూనివర్శల్‌ కంట్రోల్‌  పేరుతో  కీబోర్డు షేరింగ్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నారు. దీంతో మ్యాక్‌, ఐప్యాడ్‌కు ఒకే కీబోర్డు, మౌస్‌ను ఏకకాలంలో వినియోగించవచ్చు.  

ఐవోఎస్‌ డివైజ్‌ల స్క్రీన్‌ను ఎయిర్‌ప్లే సాయంతో మ్యాక్‌లో  బీమ్‌ చేయొచ్చు. మ్యాక్‌ ఓఎస్‌ కోసం సఫారీ బ్రౌజర్‌లో మార్పులు చేశారు. ట్యాబ్స్‌ బుక్‌మార్కింగ్‌, గ్రూపింగ్‌, షార్ట్‌కట్స్‌ లాంటి  కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు.


ప్రైవసీ కోసం... 

∎ యాపిల్‌ డివైజ్‌ల్లో ప్రైవసీని పెంచడానికి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెయిల్‌ యాప్‌లో ట్రాకర్‌ బ్లాకర్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్‌ ఐపీ, లొకేషన్‌  తదితర వివరాలను హ్యాకర్లు తెలుసుకోకుండా చేయడం ట్రాకర్‌ బ్లాకర్స్‌ పని. దీంతోపాటు యాప్‌ ట్రాకర్‌ రిపోర్ట్‌ అనే ఫీచర్‌ను జోడిస్తున్నారు. మొబైల్‌లోని యాప్స్‌ ఏయే పర్మిషన్‌ను ఎంతసేపు వాడాయనేది రిపోర్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


క్లౌడ్‌ కొత్తగా... 

∎ యాపిల్‌ డివైజ్‌ల డేటా స్టోరేజీ ఐక్లౌడ్‌కు యాపిల్‌ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ను ప్రకటించింది. అదే ఐక్లౌడ్‌ ప్లస్‌. ఆన్‌లైన్‌ ప్రైవసీని మరింత పెంచుతూ కొత్త ఐక్లౌడ్‌ను తీసుకొస్తున్నారు. వీపీఎన్‌ తరహాలోనే ఈ కొత్త క్లౌడ్‌ సర్వీసు పని చేస్తుంది. 


ఐప్యాడ్‌లో  ఇలా... 

కొత్త ఐప్యాడ్‌ ఓఎస్‌లో యాప్స్‌ను రీఅరేంజ్‌ చేసుకునే ఫీచర్‌ ఇస్తున్నారు. విడ్జెట్స్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. మల్టీటాస్కింగ్‌ ఇంటర్‌ ఫేస్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఐప్యాడ్‌లో రెండు యాప్‌లను ఒకేసారి వాడుకోవచ్చు.

నోట్స్‌ యాప్‌ను ఆధునికీరిస్తున్నారు. యాపిల్‌ పెన్సిల్‌తో  ఐప్యాడ్‌ స్క్రీన్‌ అంచు నుండి పైకి రాస్తే... నేరుగా నోట్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసేలా మార్పులు చేస్తున్నారు.  దీంతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్‌ అయ్యేలా యాప్‌లో మార్పులు చేస్తున్నారు. అంటే వాయిస్‌ను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్‌ చేయొచ్చు.


వాచ్‌లో మార్పులు... 

∎ యాపిల్‌ వాచ్‌ కోసం కొత్తగా వాచ్‌ ఓఎస్‌8ను లాంచ్‌ చేసింది. ఇందులో ఎప్పటిలాగే కొత్త వాచ్‌ ఫేస్‌లను యాడ్ చేశారు. వాటితోపాటు కొత్తగా వాచ్‌లో వేలితో టెక్స్ట్‌ రాసుకునే ఫీచర్‌ను జోడించారు. మైండ్‌ఫుల్‌నెస్‌ అనే బ్రీత్‌ యాప్‌ను యాడ్ చేశారు. నిద్రపోయే సమయంలో బాడీ రెసిప్‌రేటరీ లెవల్స్‌ను ట్రాక్‌ చేయడం ఈ యాప్‌ పని. 


మరిన్ని వివరాలు కావాలంటే... దిగువ వీడియో చూడండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న