నోకియా 10 PureView ‌ఫోనే వస్తుందా..!‌ 
close

Updated : 03/11/2020 18:47 IST

నోకియా 10 PureView ‌ఫోనే వస్తుందా..!‌ 

అధికారికంగా వెల్లడించని హెచ్‌ఎండీ గ్లోబల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా.. సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఎవరి నోట విన్నా ఇదే మాట.. అయితే స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో నోకియా తన ప్రభను కొనసాగించలేక మార్కెట్‌ను కోల్పోయింది. గత కొన్నేళ్లుగా పలు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చినా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. ఎలాగైనా సరే స్మార్ట్‌ ఫోన్‌ విపణిలో తన సత్తా చాటేందుకు మరోసారి నోకియా రాబోతుంది. వచ్చేఏడాది ప్రధానమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే నోకియా 9 PureView స్మార్ట్‌ఫోన్‌ విపణిలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. దీనికి అదనపు ఫీచర్లతో  నోకియా 9.1 PureView,నోకియా 9.2 PureView, నోకియా 9.3 PureView సిరీస్‌ ఫోన్లు రానున్నాయని సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా వార్తలు వచ్చాయి. అయితే నోకియా 9 PureViewకు అదనపు ఫీచర్లను జతచేసి నోకియా 10 PureView (అనధికారికంగా పిలవబడే) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీంతో రూమర్స్‌కు చెక్‌పెట్టినట్లైంది. నోకియా 10 PureView స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ గురించి సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.  అయితే ఫీచర్లకు సంబంధించి పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫీచర్లు ఏంటో మనమూ తెలుసుకుందామా...!

ఇవేనా ఫీచర్స్‌:

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 875 SoC ప్రాసెసర్‌
* స్టైన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌
* సఫైర్‌ గ్లాస్‌ డిస్‌ప్లే
* మల్టి లెన్స్‌ కెమెరా ఫీచరింగ్ జీస్‌ ఆప్టిక్స్‌
* వచ్చే ఏడాది రెండో భాగంలో ఫోన్‌ విడుదల అయ్యే అవకాశం
* ధర ఎంత ఉండొచ్చనేది తెలియరాలేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న