Instagram Down: ఇన్‌స్టాగ్రాంలో సాంకేతిక సమస్య..నిలిచిన సేవలు
close

Updated : 02/09/2021 15:56 IST
Instagram Down: ఇన్‌స్టాగ్రాంలో సాంకేతిక సమస్య..నిలిచిన సేవలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌కు చెందిన ఫొటో, వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రాం సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రాం యూజర్స్‌ తమ ఖాతాల్లో పోస్టులు చేయలేకపోయామని తెలిపారు. అలానే తమ ఇన్‌స్టా పేజీల్లో ఫీడ్‌ అప్‌డేట్ కావడంలేదని వెల్లడించారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా తమ అసహనం వ్యక్తం చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్ ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు. డౌన్‌ డిటెక్టర్‌ అనే సైబర్‌ సంస్థ తెలిపిన దాని ప్రకారం.. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొంది. ఇప్పటికీ కొంత మంది యూజర్స్‌ ఇన్‌స్టాగ్రాం పనిచేయట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. #instagramdown అనే హ్యాష్‌టాగ్‌తో పలువురు యూజర్స్‌ వరుస ట్వీట్లు చేస్తున్నారు. జర్మనీ, అమెరికా, భారత్‌లోని యూజర్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్స్‌ ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇన్‌స్టాగ్రాం సేవలు నిలిచిపోవడానికి సాంకేతిక సమస్య లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న