ఇన్‌స్టాలో అవి చూడాలంటే డబ్బు చెల్లించాల్సిందేనా?
close

Published : 02/07/2021 20:27 IST
ఇన్‌స్టాలో అవి చూడాలంటే డబ్బు చెల్లించాల్సిందేనా?

ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలకు మాత్రమే ఇలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: అరచేతిలో వినోదాన్నే కాదు.. ప్రతిభ ఉంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసే సత్తా ‘ఇన్‌స్టాగ్రామ్‌’కు ఉంది. అందుకే మరి చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ యాప్‌ని తెగ వాడుతున్నారు. ఇక ఇన్‌స్టాలో అందరినీ ఆకర్షించే ఫీచర్‌ ఇన్‌స్టా స్టోరీస్‌. చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పే వెసులుబాటు ఇందులో ఉంటుంది. ఫొటోలతో పాటు సెకన్ల నుంచి నిమిషాల వ్యవధి ఉండే వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పోస్ట్‌ అప్‌లోడ్ చేసినా ముందస్తుగా వాటి సమాచారాన్ని స్టోరీల రూపంలో అప్‌లోడ్‌ చేస్తారు ఇన్‌స్టా యూజర్లు.

ఇక నుంచి అందరి ఇన్‌స్టా స్టోరీలు చూడటం సాధ్యం కాకపోవచ్చు. తాజాగా ఇందుకు సంబంధించి ఇన్‌స్టా టెక్నికల్‌ డెవలపర్‌ ఒక ఆసక్తికర అంశాన్ని చెబుతూ.. ‘అవును..ఇకపై ఇన్‌స్టాలో మార్పులు రానున్నాయి. ఫ్యాన్స్‌క్లబ్‌ స్టోరీలు, ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలు అనేవి డబ్బులు చెల్లించి చూసేలా రూపొందిస్తున్నాం. డబ్బు చెల్లించిన వినియోగదారుడు మాత్రమే యూజర్‌ ఐడీతో స్టోరీలను చూడొచ్చు. అంతేకాదు.. దాన్ని తన హైలైట్స్‌లోనూ పెట్టుకోవచ్చు. అయితే ఒక షరతు ఉంది. అదేంటంటే..ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీల స్క్రిన్‌షాట్స్‌ తీయడానికి మాత్రం రాదు. కాగా ఈ స్టోరీలన్నీ పర్పుల్‌ రంగులో అందుబాటులోకి రానుంది.’’ అని తెలిపారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న