QR@క్రోమ్‌: థర్డ్‌పార్టీ సర్వీసులు అక్కర్లేదు
close

Published : 06/02/2021 13:19 IST

QR@క్రోమ్‌: థర్డ్‌పార్టీ సర్వీసులు అక్కర్లేదు

ఏదైనా షేర్‌ చేయాలంటే గతంలో ముందు కాపీ చేయడం.. తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్‌ చేయడం.. అవి వెబ్‌ యూఆర్‌ఎల్‌ లింక్‌లు అయినా.. అలాంటప్పుడు ఆయా లింక్‌లను తిరిగి ఓపెన్‌ చేయాలంటే? టైప్‌ చేసి చూడడం కొంచెం కష్టమే. ఈ సమస్యని అధిగమించేందుకు ఎప్పటి నుంచో క్యూఆర్‌ కోడ్‌లు ట్రెండింగ్‌ అయ్యాయి. కోడ్‌లను క్రియేట్‌ చేయడానికి చాలానే థర్డ్‌పార్టీ సర్వీసులూ ఉన్నాయి. కానీ, మీకు తెలుసా? వాటితో పని లేకుండా గూగుల్‌ క్రోమ్‌లో సులభమైన పద్ధతిలో క్యూఆర్‌ కోడ్‌లను క్రియేట్‌ చేయొచ్చు. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!


డేటాని పంచుకోవడం..

చూడ్డానికి అర్థం కాకుండా కనిపించే క్యూఆర్‌ కోడ్‌లో డేటాని షేర్‌ చేయడం టెకీలకు అలవాటైపోయింది. 4,296 ఆల్ఫాన్యూమరిక్‌ క్యారెక్టర్లని లేదా 7,089 అంకెల్ని ఓ చిన్న క్యూఆర్‌లో స్టోర్‌ చేసేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌ కెమెరాతో దాన్ని స్కాన్‌ చేసి డేటాని యాక్సెస్‌ చేస్తున్నారు. అలాంటి క్యూఆర్‌ కోడ్‌లను క్రోమ్‌లనే క్రియేట్‌ చేసేందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఎనేబుల్‌ చేసేందుకు ప్రత్యేక కమాండ్‌ని వాడాలి. అదే chrome://flags/#sharing-qr-code-generator. బ్రౌజర్‌ సెర్చ్‌ బాక్స్‌లో ఎంటర్‌ చేసి ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. తిరిగి బ్రౌజర్‌ని రీలాంచ్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ ఫీచర్‌ బ్రౌజర్‌ ఆప్షన్స్‌లోకి వస్తుంది. ఇక ఎప్పుడైనా ఏదైనా వెబ్‌ పేజీ యూఆర్‌ఎల్‌కి క్యూఆర్‌ కోడ్‌ని క్రియేట్‌ చేయాలంటే.. పేజీలో రైట్‌క్లిక్‌ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలో Create QR code for this page ఆప్షన్‌ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే క్షణాల్లో పేజీకి క్యూఆర్‌ కోడ్‌ వచ్చేస్తుంది. ఆ వెంటనే కోడ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఎవరితోనైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ని పంచుకోవాలంటే క్యూఆర్‌ని షేర్‌ చేస్తే చాలు. దాన్ని ఫోన్‌లోని కెమెరా యాప్‌తో స్కాన్‌ చేసి లింక్‌ని పొందొచ్చు.


ఫోన్‌లో అయితే ఇలా..

డెస్క్‌టాప్‌లో మాదిరిగానే ఫోన్‌నూ క్రోమ్‌ బ్రౌజర్‌తో క్యూఆర్‌లు క్రియేట్‌ చేసుకోవచ్చు. అందుకు ఫోన్‌లో ఏదైనా వెబ్‌ పేజీని ఓపెన్‌ చేశాక పై భాగంలో కుడివైపు కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలోని ‘షేర్‌’ ఆప్షన్‌ని క్లిక్‌ చేసి ‘క్యూఆర్‌ కోడ్‌’ని ఎంచుకోవచ్చు. దీంతో క్యూఆర్‌ తెరపై వచ్చేస్తుంది. డౌన్‌లోడ్‌ చేసి ఎవరితోనైనా పంచుకోవచ్చు. మరో విధానంతోనూ క్యూఆర్‌ ఆప్షన్‌ని ఫోన్‌లో పొందొచ్చు. అదెలాగంటే.. సెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్‌లో ఏదైనా లింక్‌కి క్యూఆర్‌ పెట్టాలనుకుంటే.. ఆ లింక్‌ని ఓపెన్‌ చేయకుండానే.. దానిపై ట్యాప్‌ చేసి ఉంచితే పాప్‌అప్‌ మెనూ వస్తుంది. దాంట్లో ‘షేర్‌ లింక్‌’ని తాకితే క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ని చూడొచ్చు.


క్రోమ్‌ చిట్కా మరోటి..

డీఫాల్ట్‌గా బ్రౌజర్‌ని ఓపెన్‌ చేస్తే.. గూగుల్‌ సెర్చ్‌తో కూడిన ఖాళీ హోం పేజీ వస్తుంది. అప్పుడు మీరు దేనిలోకి వెళ్లాలనుకుంటున్నారో అది ఓపెన్‌ చేస్తుంటారు. కానీ, రోజూ నెట్టింట్లో అడుగుపెట్టగానే చూడాల్సిన సర్వీసులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు జీమెయిల్‌ని చెక్‌ చేయడం.. వార్తాంశాల కోసం మరో వెబ్‌సైట్‌ని చూడడం.. ఇలా రోజూ అలవాటుగా చేస్తున్నట్లయితే.. బ్రౌజర్‌ ‘స్టార్ట్‌అప్‌’లో ఆటోమేటిక్‌గా వీటిని ట్యాబ్‌ల్లో ఓపెన్‌ అయ్యేలా చేయొచ్చు. అందుకు హోం హోం పేజీలోకి కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలోకి సెట్టింగ్స్‌లోకి వెళ్తే On startup ఫీచర్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేసి Open a specific page or set of pages ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత మీకు ఓపెన్‌ అవ్వాలనుకునే వెబ్‌ సర్వీసుల్ని జత చేయండి. అంతే.. మీరు ఎప్పుడు బ్రౌజర్‌ని ఓపెన్‌ చేసినా ఆయా సర్వీసులు చక చకా ఓపెన్‌ అవుతాయి.


ఇవీ చదవండి..

ఫోన్ కెమెరాతో హార్ట్‌ రేట్ ట్రాకింగ్.. 

ఇన్‌స్టాగ్రాంలో టిక్‌టాక్‌ తరహా ఫీచర్..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న