Jio Fiber: వెబ్‌ కెమెరా లేకుండా టీవీలో వీడియోకాల్స్‌
close

Published : 03/08/2021 22:45 IST
Jio Fiber: వెబ్‌ కెమెరా లేకుండా టీవీలో వీడియోకాల్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జియో ఫైబర్‌ యూజర్స్‌కి మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌ కెమెరా అవసరం లేకుండా యూజర్స్ తమ మొబైల్ ఫోన్ సాయంతో టీవీలో వీడియో కాల్స్ మాట్లాడుకునేలా ‘కెమెరా ఆన్‌ మొబైల్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్‌ జియో జాయిన్ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉందని తెలిపింది. జియో ఫైబర్ సర్వీసుల్లో భాగంగా  జియో ఫైబర్‌ వాయిస్‌ సేవల ద్వారా ఈ వీడియో కాలింగ్ ఫీచర్‌ను బ్రాడ్‌బాండ్ యూజర్స్‌కి అందిస్తున్నారు. అలాగే, జియో ఫైబర్‌ వినియోగదారులు జియో జాయిన్‌ యాప్‌లో ల్యాండ్‌లైన్ నంబర్‌ ఎంటర్ చేసి వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. 

ఈ వీడియో కాలింగ్ ఫీచర్‌ కోసం యూజర్స్ ముందుగా తమ పది అంకెల జియో నంబర్‌ని జియో జాయిన్ యాప్‌లో ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ మొబైల్‌ వర్చువల్‌గా టీవీకి కనెక్ట్ అవుతుంది. తర్వాత జియ్‌ జాయిన్ యాప్‌ సెట్టింగ్స్‌లో ‘కెమెరా ఆన్‌ మొబైల్’ ఫీచర్ ఎనేబుల్ చేసి టీవీ నుంచి వీడియో కాలింగ్ సేవలను ఎంజాయ్ చెయ్యొచ్చు. అయితే ఈ ఫీచర్ ద్వారా మెరుగైన వీడియో కాలింగ్ సేవలను ఆస్వాదించాలంటే 5 గిగా హెడ్జ్‌ సామర్థ్యం కలిగిన వైఫై మోడెమ్‌ ఉపయోగించడం మేలని జియో ఫైబర్ సూచిస్తుంది. 2.4 గిగాహెడ్జ్‌ సామర్థ్యంతో కూడా వీడియో కాలింగ్ సేవలను ఆస్వాదించవచ్చని తెలిపింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న