‘నాలుగు’ కెమెరాలతో ఎల్‌జీ కొత్త ఫోన్లు..
close

Published : 23/02/2021 23:46 IST
‘నాలుగు’ కెమెరాలతో ఎల్‌జీ కొత్త ఫోన్లు..

ఇంటర్నెట్ డెస్క్‌: ఎల్‌జీ కంపెనీ డబ్ల్యూ సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ W41, W41 ప్లస్‌, W41 ప్రో పేరుతో వీటిని పరిచయం చేశారు. ఈ మోడల్స్‌లో క్వాడ్ రియర్ కెమెరా, 5K బ్యాటరీ, పంచ్‌ హోల్ డిస్‌ప్లే డిజైన్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ర్యామ్‌, మెమొరీ మినహా మూడు మోడల్స్‌లో ఒకే రకమైన ఫీచర్స్ ఉన్నాయి. మరి ఎల్‌జీ తీసుకొచ్చిన ఈ W సిరీస్‌ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

* ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆధారిత క్యూ ఓఎస్‌తో పనిచేస్తాయి. 

* 6.5-అంగుళాల హెచ్‌డీ+ హెచ్‌ఐడీ ఫుల్ విజన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉపయోగించారు.

* W41 సిరీస్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. 

* వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 2 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 

* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. 

* W41 మోడల్‌ 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ ధర రూ.13,490. W41+ మోడల్ 4జీబీ/128జీబీ ధర రూ.14,490. W41 ప్రో 6జీబీ/128జీబీ ధర రూ. 15,490. లేజర్ బ్లూ, మ్యాజిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న