2-In-1 Laptop: మైక్రోసాఫ్ట్‌ కొత్త ల్యాప్‌టాప్‌..హెచ్‌పీ ట్యాబ్‌లెట్‌ పీసీ
close

Published : 23/09/2021 23:52 IST
2-In-1 Laptop: మైక్రోసాఫ్ట్‌ కొత్త ల్యాప్‌టాప్‌..హెచ్‌పీ ట్యాబ్‌లెట్‌ పీసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావడంతో ఆన్‌లైన్ క్లాసులు, సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా హెచ్‌పీ కంపెనీ కొత్త మోడల్‌ ట్యాబ్‌, మైక్రోసాఫ్ట్ టు-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌ను విడుదల చేశాయి. వాటిలో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం. 


హెచ్‌పీ ట్యాబ్‌లెట్ పీసీ

ట్యాబ్‌లోనే ల్యాప్‌టాప్ తరహా డిస్‌ప్లే అనుభూతిని అందించేందుకు 11 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్క్రీన్‌ ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. ఇంటెల్‌ పెంటియమ్‌ సిల్వర్‌ ఎన్‌6000 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్ ర్యామ్ ఇస్తున్నారు. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ 13 ఎంపీ రొటేషన్‌ కెమెరా. ఇది వెనుకవైపు కెమెరాలానే కాకుండా సెల్ఫీ కెమెరాలాగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం కెమెరాలో 180 డిగ్రీల రొటేషన్ మెకానిజమ్ ఇస్తున్నారు. ఈ ట్యాబ్‌కు ఎక్స్‌టర్నల్‌ కీబోర్డ్‌ను జోడించి కంప్యూటర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చని హెచ్‌పీ తెలిపింది. అలానే హెచ్‌పీ టిల్ట్‌ పెన్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫింగర్‌ ప్రింట్ రీడర్ కూడా ఉంది. 4 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 599 డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ. 45,000 ఉంటుంది. డిసెంబరు 11 తేదీ నుంచి ఈ ట్యాబ్‌ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 


మైక్రోసాఫ్ట్ టు-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌

మైక్రోసాఫ్ట్ కంపెనీ సర్ఫేస్‌ ప్రో 8 పేరుతో టు-ఇన్‌-వన్ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, డాల్బీ విజన్‌ అండ్ అడాప్టివ్‌తో 13 అంగుళాల హై రిజల్యూషన్‌ టచ్‌ స్క్రీన్‌ ఇస్తున్నారు. విండోస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇంటెల్‌ కోర్‌ 11వ జనరేషన్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 32 జీబీ ర్యామ్‌ ఇస్తున్నారు. ఇందులో రెండు కెమెరాలున్నాయి. ముందు డిస్‌ప్లే పై భాగంలో 5ఎంపీ కెమెరా, వెనుక 10 ఎంపీ కెమెరా అమర్చారు. దీనికి డిటాచబుల్ కీ బోర్డ్‌ ఇస్తున్నారు. అంటే ఈ కీ బోర్డ్‌ని అవరమైనప్పుడు డిస్‌ప్లేకి జోడించి ల్యాప్‌టాప్‌లాగా,  కీ బోర్డ్‌ని తొలగించి ట్యాబ్‌లాగా వాడుకోవచ్చు. అలానే ల్యాప్‌టాప్ డిస్‌ప్లే సర్ఫేస్‌ స్లిమ్‌ పెన్‌ 2ని కూడా సపోర్ట్ చేస్తుంది. పెన్‌లో ఉండే వైబ్రేషన్‌ మోటార్‌ పేపర్ మీద రాస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కాసారి ఛార్జ్ చేస్తే 16 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. నాలుగు యూఎస్‌బీ4/థండర్‌బోల్ట్‌ పోర్ట్‌లు ఉన్నాయి. దీని ధర 1,099 డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ. 81,000 ఉంటుందని అంచనా. భారత్‌లో త్వరలోనే వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న