‘విండోస్ 10’ ఓఎస్‌కు కొత్త వెర్షన్‌‌.. ఇదేనా..?
close

Published : 01/03/2021 17:24 IST

‘విండోస్ 10’ ఓఎస్‌కు కొత్త వెర్షన్‌‌.. ఇదేనా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన ఆపరేటింగ్‌ సిస్టమ్స్ (ఓఎస్)కు భలే డిమాండ్‌గా ఉంటుంది. పీసీ పనితీరు వేగంగా ఉండటంతోపాటు ఫీచర్లు బాగుంటాయి. విండోస్ 10 ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చి ఐదేళ్లకుపైగా అయింది. ఈ క్రమంలో అప్‌డేషన్‌ వెర్షన్‌పై ప్రకటన చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. విండోస్‌ 10కు కొత్త వెర్షన్‌ను ‘విండోస్‌ 10X’ లేదా ‘ద న్యూ విండోస్‌’ పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్‌ వరకు ఎలాంటి ప్రకటన లేకపోతే వెర్షన్‌ టీజర్‌ కూడా వచ్చే అవకాశం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో విండోస్‌ 10 ఓఎస్‌కు మార్పులు చేసి 2021లో విడుదల చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమైందని వార్తలు వచ్చాయి. కొత్త ఇంటర్‌ఫేస్‌కు ‘సన్ వ్యాలీ’ అని పేరు పెట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వసంతకాలంలో విండోస్‌ 10 సన్‌వ్యాలీకి అదనంగా ఫీచర్లను జోడించి విండోస్‌ 10X ఓఎస్‌ను తీసుకురావాలని మైక్రోసాఫ్ట్‌ ప్రకటన చేయనుంది.

ఏప్రిల్‌ లేదా మే నెలలో ‘వాట్స్‌ న్యూ ఫర్‌ విండోస్’ ఈవెంట్‌ను నిర్వహించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. మార్చిలో జరగనున్న ‘వాట్స్‌ న్యూ ఫర్‌ గేమింగ్‌’ కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత ‘వాట్స్‌ న్యూ ఫర్‌ విండోస్’ ఈవెంట్‌ నిర్వహణపై మైక్రోసాఫ్ట్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. విండోస్‌ 10 వెర్షన్‌కు పూర్తిగా కొత్త ఎడిషన్‌గా ‘ద న్యూ విండోస్’ ఓఎస్ తీసుకురాబోతున్నామని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. కొత్త ఓఎస్‌లో డార్క్‌ మోడ్‌ ఎక్స్‌పీరియన్స్, స్టార్ట్‌ మెనూ, యాక్షన్ సెంటర్, ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్ వంటి సెక్షన్లలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు అప్‌డేషన్‌కు సంబంధించి మైక్రోసాఫ్ట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న