మీకూ, మీ కుటుంబానికి ‘గార్డియన్‌’
close

Updated : 04/03/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మీకూ, మీ కుటుంబానికి ‘గార్డియన్‌’

ట్రూకాలర్‌ సేఫ్టీ యాప్‌

సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న నేరాలు.. ప్రతి ఒక్కరిలోనూ అభద్రతా భావాన్ని పెంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబంలో ఎవరు బయటికి వెళ్లినా.. తిరిగి వచ్చేంత వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక అమ్మాయిలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ని వ్యకిగత రక్షకుడిలా మార్చేయొచ్చు. అందుకు తగిన యాప్‌ని ట్రూకాలర్‌ సిద్ధం చేసింది. అదే ‘గార్డియన్స్‌’. ఆండ్రాయిడ్, యాపిల్‌ యూజర్లు ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. 

ఎక్కడున్నా.. ట్రాక్‌ చేయొచ్చు

వాట్సాప్‌లో లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌ చేస్తుంటాం. దీన్ని ఎప్పటి నుంచో వివిధ అవరాలకు వాడుతున్నాం. నిర్ణీత సమయం వరకూ మీరు ఉన్న ప్రాంతం వివరాలను... మీరు లొకేషన్‌ పంపిన వాళ్లకు చూపిస్తుంది. తర్వాత డిసేబుల్‌ అయిపోతుంది. ఇదే పద్ధతిలో అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేవారికి లొకేషన్‌ని నిత్యం యాక్సెస్‌ అయ్యేలా చేయవచ్చు. అంటే రోజూ వివిధ అవసరాల నిమిత్తం బయటి తిరుగుతుంటాం. ఉద్యోగం నిమిత్తం ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్తాం, లేదంటే ఎవరైనా కొత్త వారిని కలిసేందుకు మీటింగ్‌ ప్లాన్‌ చేస్తాం. ఇలాంటి సందర్భాల్లో సెక్యూరిటీ గురించి కచ్చితంగా ఆలోచించాలి. గార్డియన్స్‌గా కొంత మందిని ఎంపిక చేసుకోవాలి. అందుకు సులువైన వేదికే ‘గార్డియన్స్‌’ యాప్‌. మొబైల్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ని గార్డియన్స్‌గా ఎంచుకోవచ్చు. మీరెక్కడున్న వారో కంట కనిపెట్టేలా మీ లొకేషన్‌ని వారితో పంచుకోవచ్చు. 

అంతా ‘ప్రైవేటు’గానే..

యాప్‌లో లొకేషన్‌ని షేర్‌ చేయడం అంటే ప్రైవసీకి సమస్య వస్తుందేమోనని సందేహించక్కర్లేదు. వ్యవహారం మొత్తం ప్రైవేటుగానే సాగుతుంది. కేవలం మీరు గార్డియన్లుగా ఎంపిక చేసుకున్నవారు మాత్రమే మీ జీపీఎస్‌ లొకేషన్‌ని చూడగలుగుతారు. అవసరమైనప్పుడు మాత్రమే కాకుండా... శాశ్వతంగా లొకేషన్‌ యాక్సెస్‌ని ఇవ్వొచ్చు. లేదంటే అత్యవసర సందర్భాల్లో మాత్రమే లొకేషన్‌ని పంచుకోవచ్చు. గార్డియన్స్‌కి లొకేషన్‌ని షేర్‌ చేసిన వెంటనే...  అలర్ట్‌ నోటిఫికేషన్‌ వెళ్తుంది. దీంతో వాళ్లు మీ లొకేషన్‌ని ఫాలో అవ్వొచ్చు. ఎప్పుడైనా మీరు ఉన్న స్థితి ప్రమాదకరంగా అనిపిస్తే.. గార్డియన్లకు సమాచారాన్ని అందించొచ్చు. అందుకు ప్రత్యేకంగా ‘ఐ నీడ్‌ హెల్ఫ్‌’ ఆప్షన్‌ ఉంది. ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ లెవల్, నెట్‌వర్క్, ఫోన్‌ స్టేటస్, ఇతర వివరాల్ని కూడా గార్డియన్లు మానిటర్‌ చేసేందుకు వీలుంది. 

యాప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3bdxSFj

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న