నకిలీలను పట్టేయండి.. యూట్యూబ్‌ యాప్‌
close

Updated : 28/01/2021 09:14 IST
నకిలీలను పట్టేయండి.. యూట్యూబ్‌ యాప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌.. మరేదైనా డివైజ్‌ల్లో యూట్యూబ్‌ని ఓపెన్‌ చేయాలంటే? ఏదో ఒక బ్రౌజర్‌లో యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ని టైప్‌ చేసి ఓపెన్‌ చేస్తాం. లేదంటే బుక్‌మార్క్‌లపై ఆధారపడతాం. ఇకపై అంత కష్టపడకుండానే యూట్యూబ్‌ని డెస్క్‌టాప్‌పై అప్లికేషన్‌ మాదిరిగా ఓపెన్‌ చేయొచ్చు. అదెలా కుదురుతుందంటే.. యూట్యూబ్‌ ‘ప్రోగ్రసివ్‌ వెబ్‌ యాప్‌’గా ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ అంటున్నారంటే ఇదేదో క్లిష్టమైన పని అనుకోవద్దు. చాలా సింపుల్‌. మీరు ఏ బ్రౌజర్‌ వాడుతున్నా అడ్రస్‌బార్‌లో యూట్యూబ్‌ని ఓపెన్‌ చేయండి. అడ్రస్‌బార్‌ చివర్లో ‘ప్లస్‌’ గుర్తు కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి యూట్యూబ్‌ వెబ్‌ యాప్‌ని సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అంతే.. డెస్క్‌టాప్‌పై యూట్యూబ్‌ యాప్‌ షార్ట్‌కట్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. డబుల్‌ క్లిక్‌ చేసి యాప్‌లా కొత్త ఇంటర్ఫేస్‌లో ఓపెన్‌ చేయొచ్చు. అడ్రస్‌బార్‌తో పాటు ఇతర ఆప్షన్లు లేకుండా యూజర్‌ ఫ్రెండ్లీగా వెబ్‌ యాప్‌ కనిపిస్తుంది.


కొవిడ్‌ టీకా.. గూగుల్‌ మ్యాప్స్‌

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే టాపిక్‌. కొవిడ్‌-19 టీకా. మన దేశంలోనూ విడతలవారీగా టీకా వేస్తున్నారు. మరైతే, ఎక్కడెక్కడ ఏయే సెంటర్లలో టీకాలు వేస్తున్నారు? ఆయా లొకేషన్‌లకు చేరుకోవడం ఎలా? అని ఆలోచించక్కర్లేదు. vaccines near me అని గూగుల్‌ సెర్చ్‌లో వెతికాల్సిన పని లేదు. ఎందుకంటే.. గూగుల్‌ ‘మ్యాప్స్‌’ ప్లాట్‌ఫామ్‌పైకి టీకా సెంటర్లలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని అందించేందుకు సిద్ధం అవుతోంది. ‘సెర్చ్‌’ ద్వారా కూడా టీకాకి సంబంధించిన వివరాల్ని ప్రత్యేకంగా పొందొచ్చు. ప్రస్తుతానికి మ్యాప్స్‌లో ఈ సౌలభ్యం కొన్ని దేశాల్లోన్నే అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు సిద్ధం అవుతోంది.


 నకిలీలు పట్టేయండి..

పర్సనల్‌ కంప్యూటర్‌లుగా మ్యాక్‌ల వాడకం కూడా బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలో విండోస్‌ డెస్క్‌టాప్‌లో మాదిరిగానే మ్యాక్‌లో కూడా డూప్లికేట్‌ ఫైల్స్‌ని వెతకాలంటే? Gemini II అప్లికేషన్‌ని వాడొచ్చు. అన్ని రకాల ఫైల్స్‌ని ఇది స్కాన్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్‌ ఫైల్స్‌లో ఏవైనా డూప్లికేట్‌ ఉంటే వెతికి చూపిస్తుంది. అక్కర్లేని వాటిని తొలగించొచ్చు. దీంతో స్టోరేజ్‌ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం సులభం అవుతుంది. మ్యాక్‌ యూజర్లు ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న