New 5G Phones: గేమర్స్‌కి పోకో ఎఫ్3 GT.. శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A22 
close

Updated : 23/07/2021 17:13 IST
New 5G Phones: గేమర్స్‌కి పోకో ఎఫ్3 GT.. శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A22 

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రాకముందే మొబైల్ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఏడాది కాలంగా ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో 5జీ మోడల్స్‌ను విడుదల చేసిన మొబైల్ కంపెనీలు..కొద్ది నెలలుగా మిడ్‌-రేంజ్‌ మోడల్స్‌ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా పోకో, శాంసంగ్‌ కంపెనీలు కొత్త 5జీ మోడల్స్‌ను భారత మార్కెట్లోకి విడుదలచేశాయి. పోకో ఎఫ్3 జీటీ, శాంసంగ్ గెలాక్సీ ఏ22 పేర్లతో వీటిని పరిచయం చేశారు. వీటిలో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధర ఎంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం.

పోకో ఎఫ్‌3 జీటీ

గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా మాగ్‌లెవ్‌ ట్రిగ్గర్స్ ఫీచర్ ఇస్తున్నారు. వీటి సాయంతో గేమర్స్ నాలుగు వేళ్లను ఒకేసారి ఉపయోగిస్తూ అద్భుతమైన గేమింగ్ అనుభూతిని పొందవచ్చు. ఈ ఫీచర్‌తో భారత మార్కెట్లోకి వస్తున్న తొలి ఫోన్ ఇదే. అలానే ఈ ఫోన్‌ను ఏరియోస్పేస్-గ్రేడ్ అల్యూమినియమ్‌ అలాయ్ ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు. ఇందులో 8 లేయర్ల గ్రాఫైట్‌ షీట్స్‌, వైట్ గ్రాఫైట్ హీట్ సింక్ ఉన్నాయి. ఇవి గేమ్ ఆడేప్పుడు ఉత్పన్నమయ్యే వేడి ఫోన్‌పై ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఇందులో డాల్బీ అట్‌మోస్ ఫీచర్స్‌తో డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు. మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి.

 

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఎఫ్‌3 జీటీ పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్‌రేట్‌, 480Hz టచ్‌ శాంప్లింగ్‌తో 6.67-అంగుళాల టర్బో అమోలెడ్ 10-బిట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమిన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరాలున్నాయి. ప్రధాన కెమెరా సెన్సర్‌ను డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలో ఉపయోగించే ఎక్స్‌ట్రా-లో డిస్‌పెర్షన్ (ఈడీ) గ్లాస్‌తో రూపొందించారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,065 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎల్‌-టైప్ యూఎస్‌బీ-సీ ఛార్జర్ ఇస్తున్నారు. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని పోకో తెలిపింది. ఐపీ53 వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది.  

మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గాను, 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.28,999గాను, 8జీబీ/256జీబీ వేరియంట్‌ ధర రూ. 30,999గా కంపెనీ నిర్ణయించింది. జులై 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తు బుకింగ్స్ ప్రాంరంభంకానున్నాయి. జులై 26 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ప్రారంభ ఆఫర్ కింద మొదటి వారంలో కొనుగోలు చేసిన వారికి ప్రతి వేరియంట్‌పై రూ.1000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రిడేటర్ బ్లాక్‌, గన్‌మెటల్ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది.  


శాంసంగ్‌ గెలాక్సీ ఏ22 5జీ 

జూన్‌ నెల చివర్లో గెలాక్సీ ఏ22 మోడల్‌ను విడుదల చేసిన శాంసంగ్ తాజాగా ఇదే మోడ్‌లో 5జీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ కోర్ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 11 రకాల 5జీ బ్యాండ్స్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరాలున్నాయి. వీడియోకాల్స్, సెల్ఫీల కోసం ముందుభాగంలో 8ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 15వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

రెండు వేరియంట్లలో గెలాక్సీ ఏ22 5జీని తీసుకొస్తున్నారు. 6జీబీ/128జీబీ వేరియంగ్‌ ధర రూ. 19,999కాగా, 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ. 21,999. శాంసంగ్‌ వెబ్‌సైట్‌తోపాటు అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్లలో జులై 25 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. గ్రే, మింట్, వైలెట్ రంగుల్లో లభిస్తుంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న