Realme: నియో బడ్స్‌ ₹ 500కి రూపాయి తక్కువ  
close

Published : 01/07/2021 19:34 IST
Realme: నియో బడ్స్‌ ₹ 500కి రూపాయి తక్కువ  

 

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ఫోన్లతో పాటు వాటికి అనువైన యాక్ససరీలను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి మొబైల్ తయారీ కంపెనీలు. తాజాగా రియల్‌మీ కంపెనీ సరికొత్త లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఇయర్‌ఫోన్స్‌, ట్రిమ్మర్‌, హెయిర్‌ డ్రయర్‌ వంటివి ఉన్నాయి. వాటి ధరెంత..ఎలాంటి ఫీచర్లున్నాయనేది తెలసుకుందాం. 

రియల్‌మీ బడ్స్‌2 నియో

తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో నాణ్యమైన ఇయర్‌ఫోన్స్‌ కావాలనుకునే వారికోసం రియల్‌మీ బడ్స్‌2 నియో చక్కటి ఎంపిక. యూజర్స్‌కి అద్భుతమైన బాస్‌ అనుభూతిని అందించేందుకు ఇందులో 11.2 డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. చెవిలో ఇమిడిపోయే చక్కటి ఆకృతితో వీటిని డిజైన్ చేయడమే కాకుండా మూడు సైజుల్లో ఇయర్‌ టిప్స్‌ ఇస్తున్నారు. ఫోన్‌ కాల్స్‌ మాట్లాడేప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన వాయిస్‌ క్లారిటీ కోసం హెచ్‌డీ మైక్రోఫోన్‌ను అమర్చారు. ఇది వాయిస్‌ అసిస్టెంట్, ప్లేబ్యాక్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ. 499. ఫ్లిప్‌కార్ట్‌ లేదా రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చెయ్యొచ్చు. 

రియల్‌మీ ట్రిమ్మర్‌ & డ్రైయర్‌

రియల్‌మీ బియర్డ్‌ ట్రిమ్మర్, బియర్డ్‌ ట్రిమ్మర్‌ ప్లస్‌ పేరుతో రెండు ట్రిమ్మర్లను విడుదల చేసింది. వీటిలో 800ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. రెండు గంటలు ఛార్జ్‌ చేస్తే 120 నిమిషాలు నిరంతరాయంగా పనిచేస్తాయని రియల్‌మీ తెలిపింది. తక్కువ శబ్దంతో మెరుగైన పనితీరు కనబరుస్తాయని వెల్లడించింది. వీటి ధర రూ. 1,299, రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది. ట్రిమ్మర్‌ ప్లస్‌ నీటిలో తడిచినా పాడవకుండా ఉండేందుకు ఐపీఎక్స్‌7 వాటర్‌ రెసిస్టెంట్‌తో రక్షణ కల్పించారు. ఇవి బ్లాక్‌ రంగులో లభిస్తాయి. రియల్‌మీ హెయిర్‌ డ్రైయర్‌లో 19,000 ఆర్‌ఈఎం హై-స్పీడ్ ఫ్యాన్‌, 1400వాట్‌ మోటార్‌ను అమర్చారు. పవర్‌ విండ్, సాఫ్ట్‌ విండ్ కోసం ప్రత్యేక కంట్రోల్స్‌ ఇస్తున్నారు. తెలుపు రంగులో లభిస్తుంది. దీని ధర రూ. 1,999. ఇవేకాకుండా రియల్‌మీ టెక్‌లైఫ్ ఫ్లాట్‌ఫాంలో భాగంగా డిజో బ్రాండ్‌ పేరుతో రెండు బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో డిజో వైర్‌లెస్‌ ధర రూ. 1,499 కాగా, డిజో గోపాడ్స్‌ డీ టిడబ్ల్యూఎస్ ధర రూ. 1,599. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి అమ్మకాలు ప్రారంభమైనట్లు రియల్‌మీ తెలిపింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న