Realme: కొత్త 5జీ ఫోన్ 
close

Published : 15/06/2021 22:24 IST
Realme: కొత్త 5జీ ఫోన్ 

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ 5జీ శ్రేణిలో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదలైంది. రియల్‌మీ జీటీ 5జీ పేరుతో ఆ సంస్థ ఈ ఫోన్‌ తీసుకొచ్చింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ వైడ్‌ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాలను అమర్చారు. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ మెమొరీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర 400 యూరోలుగా ఉంది. భారత్‌లో దీని ధర సుమారు రూ.39,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. డాషింగ్ బ్లూ, డాషింగ్ సిల్వర్‌, రేసింగ్ ఎల్లో రంగులో ఈ ఫోన్‌ లభిస్తుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న