Realme Narzo Smartphones: నార్జో సిరీస్‌లో రియల్‌మీ కొత్త ఫోన్లు
close

Published : 24/09/2021 21:05 IST
Realme Narzo Smartphones: నార్జో సిరీస్‌లో రియల్‌మీ కొత్త ఫోన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ కంపెనీ నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ పేరుతో వీటిని పరిచయం చేసింది. వీటిలో నార్జో 50ఏ మిడిల్‌ రేంజ్‌ మోడల్‌ కాగా, నార్జో 50ఐ ఎంట్రీ లెవల్‌ మోడల్‌. వీటి ధరెంత? ఫీచర్లు ఏంటి? అమ్మకాలు ఎప్పుడు ప్రారంభంకానున్నాయో చూద్దాం..


రియల్‌మీ నార్జో 50ఏ

ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 11,499. 4 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 12,499. 


రియల్‌మీ నార్జో 50ఐ

ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ గో ఎడిషన్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో ఆక్టాకోర్ యూనిసాక్‌ 9863 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల ఎల్‌సీడీ మల్టీ టచ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 8 ఎంపీ ఏఐ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఇస్తున్నారు. రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 2జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 7,499. 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ. 8,499.  వీటి అమ్మకాలు అక్టోబరు 7 నుంచి ప్రారంభంకానున్నాయి. రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లతోపాటు అన్ని రిటైల్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. 


వీటితోపాటు రియల్‌మీ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ, ఫిట్‌నెస్ బ్యాండ్‌ని విడుదల చేసింది. రియల్‌మీ బ్యాండ్‌ 2లో 1.4 అంగుళాల లార్జ్‌ కలర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో 90 స్పోర్ట్స్‌ మోడ్స్‌, బ్లడ్ ఆక్సిజన్‌ సెన్సర్‌, హార్ట్‌ రేట్‌ మానిటర్‌, స్లీప్ క్వాలిటీ ఆనలైజర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ కూడా ఉంది. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 2,999. రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో 32లో స్మార్ట్‌ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 20వాట్ డాల్బీ ఆడియో డ్యూయల్‌ స్పీకర్స్ ఇస్తున్నారు. ప్రీమియం బిజిల్‌లెస్‌ ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని ధర రూ. 14,999.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న