Realme Smartphones: రియల్‌మీ కొత్త ఫోన్లు.. ధర.. ఫీచర్లివే! 
close

Updated : 09/09/2021 20:38 IST
Realme Smartphones: రియల్‌మీ కొత్త ఫోన్లు.. ధర.. ఫీచర్లివే! 

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ కంపెనీ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్‌ 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఈ రెండు మోడల్స్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తాయి. మరి ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు? ధరెంత వంటి వివరాలు తెలుసుకుందాం. 


రియల్‌మీ 8ఐ

ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ డిస్‌ప్లేలో 6 రకాల రిఫ్రెష్‌ రేట్‌లు ఉన్నాయి. ఇవి ఫోన్‌లో మనం చూసే వీడియోను బట్టి మారుతుంటాయి. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉపయోగించారు. 5జీబీ వర్చువల్‌ ర్యామ్‌ ఇస్తున్నారు. ఇది ఫోన్ స్టోరేజీ నుంచి కొంత స్టోరేజ్‌ను వాడుకుని ఫోన్‌లో ఉన్న ర్యామ్‌ మరింత వేగంగా పనిచేసేందుకు సాయపడుతుంది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 13,999. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999. స్పేస్‌ బ్లాక్‌, స్పేస్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. 


రియల్‌మీ 8ఎస్‌ 5జీ

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉపయోగించారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 17,999. 8 జీబీ ర్యామ్‌ /128 జీబీ వేరియంట్‌ ధర రూ. 19,999. యూనివర్సల్‌ బ్లూ, యూనివర్సల్‌ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబరు 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రెండు మోడల్స్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

వీటితోపాటు రియల్‌మీ రెండు బ్లూటూత్ స్పీకర్లు, ఒక ఇయర్‌బడ్‌ను కూడా విడుదలచేసింది. రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌2 పేరుతో తీసుకొచ్చిన ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, 88ఎమ్‌ఎస్‌ సూపర్ లో లేటెన్సీ, 10ఎమ్‌ఎమ్‌ డైమండ్ క్లాస్‌ హై-ఫై డ్రైవర్‌, 25 గంటల ప్లేబ్యాక్‌ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర రూ. 3,299. ఇక బ్లూటూత్ స్పీకర్లలో ఒకటి 9 గంటల ప్లేబ్యాక్ ఫీచర్‌తో, మరోటి 6 గంటల ప్లేబ్యాక్ ఫీచర్‌తో ఇస్తున్నారు. రియల్‌మీ కేబుల్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ. 1,499 కాగా, రియల్‌మీ పాకెట్ బ్లూటూత్ స్పీకర్‌ ధర రూ. 999. సెప్టెంబరు 15 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న