Realme Tab: రియల్‌మీ తొలి ట్యాబ్‌..విడుదల ఎప్పుడంటే? 
close

Published : 01/09/2021 22:24 IST
Realme Tab: రియల్‌మీ తొలి ట్యాబ్‌..విడుదల ఎప్పుడంటే? 

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ తొలి ట్యాబ్‌ రియల్‌మీ పాడ్‌ను త్వరలో భారత మార్కెట్లోకి విడుదలచేయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాపిల్‌, ఐపాడ్‌లకు పోటీగా తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్‌తో రియల్‌మీ పాడ్ తీసుకొస్తున్నారట. మరి రియల్‌మీ పాడ్‌లో డిస్‌ప్లే, ప్రాసెసర్‌, కెమెరా, ర్యామ్‌తోపాటు ఇతరత్రా ఏమేం ఫీచర్లు ఇస్తున్నారో తెలుసుకుందాం. 

రియల్‌మీ పాడ్‌లో 60హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 10.4-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్‌ ఎమ్‌టీ6769వీ/సీయూ ప్రాసెసర్‌ ఉపయోగించారని తెలుస్తోంది.ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ట్యాబ్‌ పనిచేస్తుందట. అయితే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ యూఐ (యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) ఇస్తారా? లేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ యూఐని ఇస్తారా అనేది తెలియాల్సివుంది. ఇందులో రెండు కెమెరాలు ఇస్తున్నారట. వెనుకవైపు, ముందు భాగంలో 8 ఎంపీ కెమెరాలను అమర్చినట్లు టెక్‌ వర్గాల సమాచారం. రియల్‌మీ పాడ్‌లో 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. వైఫై, జీపీఎస్‌ సపోర్ట్‌తోపాటు క్వాడ్ స్పీకర్స్‌ ఇస్తున్నారట. అక్టోబరు రెండో వారంలో విడుదలకానున్న ఈ ట్యాబ్‌ ధర రూ. 17 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌వర్గాల అంచనా. అలానే రియల్‌మీ కొత్తగా తీసుకొస్తున్న వర్చువల్‌ ర్యామ్‌ టెక్నాలజీ ట్యాబ్‌లో ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న