రియల్‌మీ నార్జో 30 సిరీస్‌.. విడుదలకు రెడీ
close

Published : 18/02/2021 22:55 IST
రియల్‌మీ నార్జో 30 సిరీస్‌.. విడుదలకు రెడీ

ఇంటర్నెట్ డెస్క్‌: రియల్‌మీ మరోసారి టెక్‌ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న మూడు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో రెండు నార్జో 30 సిరీస్‌ ఫోన్లు, బడ్స్‌ ఎయిర్‌2 ఇయర్‌బడ్స్‌ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 30ఏ, నార్జో 30 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. ఇందులో నార్జో  30 ప్రో 5జీ ఫోన్‌ను మిడ్‌ రేంజ్‌ 5జీ గేమింగ్ మోడల్‌గా, నార్జో 30ఏను బడ్జెట్ గేమింగ్ ఫోన్‌ కేటగిరీలో గట్టి పోటీ ఇస్తాయని రియల్‌మీ భావిస్తోంది.  

నార్జో‌ 30 ప్రో 5జీలో డైమెన్సిసిటీ 800యూ ప్రాసెసర్ ఉపయోగించారు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. వెనక 48 ఎంపీ కెమెరాతో పాటు రెండు కెమెరాలు, ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఇక నార్జో 30ఏ మోడల్‌లో కూడా 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 24 వరకు వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న