రెడ్‌మీ నోట్‌ సిరీస్‌..రియల్‌మీ 5జీ ఫోన్ 
close

Published : 28/01/2021 18:15 IST
రెడ్‌మీ నోట్‌ సిరీస్‌..రియల్‌మీ 5జీ ఫోన్ 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌మీ, రియల్‌మీ కంపెనీలు త్వరలో కొత్త ఫోన్లతో సందడి చేయనున్నాయి. రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో, రియల్‌మీ ఎక్స్‌ సిరీస్‌లో రెండు మోడల్స్‌ని తీసుకొస్తున్నాయి. రియల్‌మీ ఫిబ్రవరి 4 తేదీన మార్కెట్లో విడుదల చేస్తుంటే..రెడ్‌మీ విడుదల తేదీపై సమాచారంలేదు. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు..వాటి ధరెంత ఉండొచ్చనేది ఒక్కసారి చూద్దాం..

రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌

రెడ్‌మీ నోట్‌ 10, నోట్‌ 10 ప్రో మోడల్స్‌లో 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. నోట్‌ 10 ప్రో మోడల్‌ 6జీబీ ర్యామ్‌/64జీబీ, 6జీబీ/128జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్లో తీసుకొస్తారు. నోట్‌ 10 మోడల్‌ 4జీబీ ర్యామ్‌/64జీబీ, 6జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో లభిస్తుందని సమాచారం.

రియల్‌మీ ఎక్స్‌7 5జీ 

రియల్‌మీ ఎక్స్‌7 5జీ, ఎక్స్‌7 ప్రో 5జీ మోడల్స్‌ను తీసుకొస్తుంది. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎక్స్‌7 5జీలో సూపర్‌ అమోలెడ్‌ ఫుల్-హెచ్‌డీ, ఎక్స్‌7 ప్రో 5జీలో సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎక్స్‌7లో వెనక వైపు మూడు, ఎక్స్‌7 ప్రోలో నాలుగు కెమెరాలు ఉంటాయి. వీటిలో 64 ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీతో పాటు ఎక్స్‌7ప్రోలో అదనంగా మరో 2ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఎక్స్‌7లో 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 50 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఎక్స్‌7 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్లు 6జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 256జీబీ వేరియంట్లో లభిస్తాయి. వీటి ధర రూ. 15,000 నుంచి రూ. 36,000 మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 4 తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి..

భారత్‌లో తగ్గనున్న ఐఫోన్ ధరలు..

మొబైల్‌ ఛార్జింగ్‌..ఈ తప్పులు చేస్తున్నారా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న