108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ 5జీ ఫోన్ 
close

Published : 26/02/2021 23:45 IST
108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ 5జీ ఫోన్ 

ఇంటర్నెట్ డెస్క్‌: బడ్జెట్ ధరలో నార్జో 30ప్రో 5జీ ఫోన్లను తీసుకొచ్చిన రియల్‌మీ త్వరలో 8 సిరీస్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ 108 ఎంపీ కెమెరాకు సంబంధించిన వివరాలు మార్చి 2న వెల్లడిస్తామని రియల్‌మీ ట్వీట్ చేసింది. అంతేకాకుండా రియల్‌మీ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్‌ ఖాన్‌ కొత్త మోడల్ ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మార్చి 2న రియల్‌మీ 8 సిరీస్‌ విడుదలపై అధికార ప్రకటన చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ కూడా త్వరలో రూ.20,000 నుంచి రూ.30,000 శ్రేణిలో సరికొత్త మోడల్‌ను తీసుకొస్తున్నట్లు ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారని సమాచారం. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారట. మిగిలిన వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న