శాంసంగ్‌ F సిరీస్‌లో 5G ఫోన్‌.. లాంచ్‌ ఆఫర్‌ కింద ₹3వేలు తగ్గింపు!
close

Published : 29/09/2021 18:46 IST

శాంసంగ్‌ F సిరీస్‌లో 5G ఫోన్‌.. లాంచ్‌ ఆఫర్‌ కింద ₹3వేలు తగ్గింపు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్‌ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గెలాక్సీ F42 5G పేరిట ఎఫ్‌ సిరీస్‌లో తొలి 5జీ ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. 90 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో డిసఫ్లే, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ₹20 వేల బడ్జెట్‌లో 5జీ ఫోన్‌కు మారాలనుకునే వారికి ఈ ఫోన్‌ మంచి ఎంపిక కానుంది.

ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 6జీబీ/ 18జీబీ వేరియంట్‌ ధర రూ.20,999గానూ, 8జీబీ/ 128జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గానూ కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్‌ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంపిక చేసిన రిటైల్‌ ఔట్‌లెట్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద 6జీబీ వేరియంట్‌ను ₹17,999కు, 8జీబీ వేరియంట్‌ను 19,999కే విక్రయించనున్నట్లు  కంపెనీ ప్రకటించింది. నో-కాస్ట్‌ ఈఎంఐతోపాటు, ఎక్స్ఛేంజీపై డిస్కౌంట్‌ కూడా లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ ప్రకటించింది.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 11తో నడిచే వన్‌యూఐ 3.1తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.6 అంగుళాల 90 హెర్జ్‌ రీఫ్రెట్‌ రేటుతో వచ్చే ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందిస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 700 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుకవైపు 64 మెగా పిక్సల్‌ ప్రధాన కెమెరాతో పాటు 5ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ అమర్చారు. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. టైప్‌-సి పోర్ట్‌తో పాటు 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ అందిస్తున్నారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. 15W ఫాస్ట్‌ ఛార్జర్‌ బాక్సులో వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఐకూ జడ్‌3, మోటోరొలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌, రియల్‌మీ ఎక్స్‌7 5జీ ఫోన్లకు ఈ ఫోన్‌ పోటీగా నిలవనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న