Samsung A22: రెండ్రోజుల ముందే వచ్చేసింది
close

Published : 30/06/2021 21:22 IST
Samsung A22: రెండ్రోజుల ముందే వచ్చేసింది

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదలైన గెలాక్సీ ఏ21ఎస్‌కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ22 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో వాటర్‌డ్రాప్‌ స్టైల్ నాచ్‌ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందుగానే శాంసంగ్‌ ఈ ఫోన్‌ను విడుదల చేయడం గమనార్హం. మరి ఈ ఫోన్‌లో ఇంకా ఏమేం ఫీచర్లున్నాయి..దీని ధరెంతో చూద్దాం.

గెలాక్సీ ఏ22 ఫీచర్స్‌... 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 కోర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్‌ రేటుతో 6.4-అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు.. ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకవైపు 48 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీ/వీడియో కాల్స్‌ కోసం 13 ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15 వాట్‌ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 38 గంటలపాటు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్‌ మాట్లాడొచ్చని శాంసంగ్‌ తెలిపింది. ఈ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 18,499. బ్లాక్‌, మింట్‌ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న