Samsung ‘The Wall’: శాంసంగ్ కోటి రూపాయల టీవీ.. విశేషాలివే!
close

Published : 23/07/2021 23:58 IST
Samsung ‘The Wall’: శాంసంగ్ కోటి రూపాయల టీవీ.. విశేషాలివే!

(Photo Credit: Samsung)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది ది వాల్‌ టీవీని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరచిన శాంసంగ్‌.. తాజాగా ది వాల్‌ రెండో వెర్షన్‌ను తీసుకొచ్చింది. బ్రైట్‌నెస్‌, డిస్‌ప్లే పరంగా ఇందులో మెరుగైన ఫీచర్స్ ఇస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది. పాత మోడల్ ఎల్‌ఈడీలతో పోలిస్తే ప్రస్తుత ఎల్‌ఈడీ ప్యానల్స్‌ 40 శాతం చిన్నవి. ఇవి హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శాంసంగ్ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇంకా ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.. 

ది వాల్‌ రెండో వెర్షన్‌ 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 16కే రిజల్యూషన్‌తో 110-అంగుళాల సైజ్‌లో ఉంటుంది. ఇందులో మైక్రోఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించారు. ఈ మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానల్స్‌తో అవసరానికి తగినట్టుగా ఈ డిస్‌ప్లేని 1000-అంగుళాల సైజ్‌కు పెంచుకోవచ్చు. 99.99 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఈ డిస్‌ప్లే ఉంటుంది. వీటిని ఎక్కువగా షాపింగ్ మాల్స్‌, కార్పొరేట్ సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు, ఆస్పత్రులు, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిస్‌ప్లే ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. అయితే ఈ డిస్‌ప్లే ధర ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. దీని ధర సుమారు రూ.కోటి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న