చిట్టి పొట్టి గ్యాడ్జెట్‌లు.. చక్కని ప్రయోజనాలు
close

Updated : 18/02/2021 18:43 IST
చిట్టి పొట్టి గ్యాడ్జెట్‌లు.. చక్కని ప్రయోజనాలు

రోజువారీ జీవితంలో గ్యాడ్జెట్‌ల తోడు అనివార్యంగా మారింది. ప్రతి అవసరానికీ భిన్నమైన డిజైన్‌లతో గ్యాడ్జెట్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటివి కొన్ని ఇవిగోండి.. నచ్చితే మీరూ వాడేయండి.


బుల్లి వాక్యూమ్‌ క్లీనర్‌

డెస్క్‌టాప్‌ కంప్యూటర్, ల్యాపీలను వాడుతున్నప్పుడు వాటిల్లో చేరుకున్న దుమ్ముని తొలగించేందుకు తెగ కష్టపడిపోవక్కర్లేదు. Eufy HomeVac H11 కార్డ్‌లెస్‌ హ్యాండ్‌హెల్డ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ని వాడేయండి. వాటర్‌ బాటిల్‌ అంత బరువుతో చేతిలో అమరిపోతుంది. దీంతో మూలమూలల్లో ఉన్న దుమ్ముని సులభంగా బయటికి లాగొచ్చు. ఫిల్టర్‌ని ఇట్టే క్లీనర్‌ నుంచి వేరు చేసి కడిగేయొచ్చు. ఫోన్‌ ఛార్జర్‌తో ఛార్జ్‌ చేయొచ్చు. పవర్ ‌బ్యాంకులకు సపోర్టు చేస్తుంది. * ధర రూ.3,990


సురక్షితమైన స్టోరేజ్‌ బాక్స్‌

హైఎండ్‌ ల్యాపీ వెంటే ఉన్నా.. కచ్చితంగా ఓ ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్‌ని వాడుతుంటాం. అయితే, వాడే ఎస్‌ఎస్‌డీ సెక్యూరిటీ సంగతేంటి? ఇదిగోండి.. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌తో పని చేసే VAVA Portable SSD Touch డ్రైవ్‌. మీ డేటాని మీరు మాత్రమే యాక్సెస్‌ చేసేలా సెక్యూర్డ్‌గా వాడుకోవచ్చు. యూఎస్‌బీ డ్రైవ్‌లా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సెకన్‌కు 540ఎంబీ స్పీడ్‌తో డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఒకవేళ మీరు బృందంగా పని చేస్తున్నట్లయితే 10 మంది సభ్యుల ఫింగర్‌ప్రింట్స్‌ని సపోర్టు చేస్తుంది. 500జీబీ, 1టీబీ, 1టీబీ స్టోరేజ్‌ సామర్థ్యంతో వాడుకోవచ్చు. * ప్రారంభ ధర రూ.6,500


స్వచ్ఛమైన గాలి కోసం..

గది ఆహ్లాదకరంగా అనిపించాలంటే.. అలంకరణంతో పాటు అంతే స్వచ్ఛమైన గాలి కూడా ఉండాలి. అప్పుడే మనసుకు హాయిగా ఉంటుంది. మరైతే, స్వచ్ఛమైన గాలి కోసం Mi Air Purifier 2S ప్యూరిఫయర్‌ని వాడేయండి. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 3-లేయర్‌ ఫిల్ట్రేషన్‌తో పని చేస్తుంది. అన్ని వైపులా గాలిని వడపోసేందుకు ఇది నిత్యం సిద్ధంగా ఉంటుంది. డిస్‌ప్లేలో ఎయిర్‌క్వాలిటీ, గది ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని చూడొచ్చు. ఆన్‌ చేసిన పది నిమిషాల్లోనే గదిని స్వచ్ఛంగా మార్చేస్తుంది. ఎంఐ హోమ్‌ యాప్‌ను  ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ప్యూరిఫయర్‌ను కంట్రోల్‌ చేయొచ్చు. వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్టు ఉంది. * ధర రూ.8,999


రికార్డింగ్‌ అదుర్సే!

ఇప్పుడంతా పాడ్‌క్యాస్ట్‌ల సందడి ఎక్కువైంది. మీరు కూడా మీ వాయిస్‌తో మ్యాజిక్‌ చేసేలా షోలను రికార్డు చేద్దాం అనుకుంటే ఈ బుజ్జి razer seiren mini మైక్రోఫోన్‌ని వాడేయండి. అదిరే క్వాలిటీతో వాయిస్‌ని రికార్డు చేస్తుంది. వీడియోల స్ట్రీమింగ్, వీడియో కాల్స్‌ని నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. వర్క్‌ స్టేషన్‌లో ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో క్షణాల్లో కనెక్ట్‌ అవుతుంది. * ధర రూ.3,700

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న