close

Published : 18/04/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
YouTube: పైకి లాగితే ఫుల్‌ స్క్రీన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  మీరు మొబైల్‌లో యూట్యూబ్‌ ఎక్కువగా చూస్తుంటారా? అయితే ఈ ఆదివారం నాడు మీకో టిప్‌ చెబుదాం.. యూట్యూబ్‌ వీడియోలను నిలువుగా చూడటం కంటే, అడ్డంగా ఫుల్‌ స్క్రీన్‌లో చూడటంలోనే మజా ఉంటుందనే విషయం మీకు తెలిసిందే. దీని కోసం వీడియో కుడివైపు దిగువన ఉండే చతురస్రాకార ఐకాన్‌ను క్లిక్‌ చేస్తుంటారు. అయితే ఆ బటన్‌ చిన్నగా ఉండటం వల్ల, ఒక్కోసారి వీడియో టైమ్‌ లైన్‌ మీద వేలు టచ్‌ అయ్యి, వీడియో ఆఖరికి వచ్చేస్తుంటుంది. దీంతో మళ్లీ ఎక్కడివరకు చూశామో చెక్‌ గుర్తుంచుకొని వెనక్కి వెళ్లాలి. గతంలో మీకూ ఇలానే జరిగిందా? అయితే ఈ టిప్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది. 

యూట్యూబ్‌లో వీడియోను ప్లే చేశాక... ఆ వీడియో మీద వేలు ఆనించి పైకి స్వైప్‌ చేయాలి. అప్పుడు వీడియో ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ (అడ్డంగా)లోకి మారిపోతుంది. కావాలంటే ఈ వార్తను మినిమైజ్‌ చేసి ఒకసారి యూట్యూబ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ఈ టిప్‌ ట్రై చేయండి. ఈ టిప్‌తో యూట్యూబ్‌లో స్క్వేర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయకుండా పోర్‌ట్రైట్‌ మోడ్‌ (నిలువు) నుంచి ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లోకి సులభంగా వెళ్లిపోవచ్చు. అయితే ఈ టిప్‌ యూట్యూబ్‌ను మొబైల్‌ బ్రౌజర్‌లో యూట్యూబ్‌ చూసేవాళ్లకు, డెస్క్‌టాప్‌లో వాడేవాళ్లకు పని చేయదు. కేవలం యూట్యూబ్‌ యాప్‌ వాడేవాళ్లకే పని చేస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు