Tweet Disappearing: ట్వీట్లు మాయం.. సరిచేస్తామన్న ట్విటర్
close

Published : 24/09/2021 00:15 IST
Tweet Disappearing: ట్వీట్లు మాయం.. సరిచేస్తామన్న ట్విటర్

ఇంటర్నెట్‌డెస్క్‌: డిస్‌అపియరింగ్ మెసేజెస్‌కు సంబంధించి ట్విటర్‌ కీలక ప్రకటన చేసింది. తర్వలోనే డిస్‌అపియరింగ్ మెసేజెస్‌ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ట్విటర్‌లో ట్వీట్లు చదివే సమయంలో అవి కనిపించకుండా పోతున్నాయని కొద్ది రోజులుగా యూజర్స్ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్విటర్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. 

యూజర్‌ తన ట్విటర్ టైమ్‌లైన్‌లో ట్వీట్‌ చదివేప్పుడు మరో యూజర్‌ సదరు ట్వీట్‌కి రిప్లై ఇచ్చినా, ట్వీట్ చేసిన యూజర్‌ దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసినా, టైమ్‌లైన్‌ పేజ్‌ ఆటోమేటిగ్గా రిఫ్రెష్‌ అయి మొదటి ట్వీట్ కనిపించకుండా పోతుంది. దానివల్ల యాప్‌తోపాటు డెస్కటాప్‌ వెర్షన్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో కూడా సమస్య తలెత్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ట్విటర్‌ ‘‘ మాకు తెలుసు ఈ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. మేం దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రెండు నెలల్లో దీనికి సంబంధించిన అప్‌డేట్లను విడుదల చేస్తాం’’ అని ట్వీట్‌ చేసింది. 

ఇటీవలే ట్విటర్ కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో సోషల్‌ ప్రైవసీకి సంబంధించిన ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. వాటితో ట్విటర్ యూజర్స్ తమని ఫాలో అయ్యేవారిలో నచ్చని వారి ఖాతాలను బ్లాక్ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌బ్లాక్‌ పీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉన్న అకౌంట్‌ బ్లాక్‌ ఫీచర్‌కి, సాఫ్ట్‌ బ్లాక్ ఫీచర్‌కి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపింది. అలానే ట్వీట్‌ రిప్లైకి ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న