Aadhaar Hackthon: ఆధార్‌ హ్యాకథాన్‌.. ప్రైజ్‌మనీ ఎంతంటే?
close

Published : 20/10/2021 23:30 IST

Aadhaar Hackthon: ఆధార్‌ హ్యాకథాన్‌.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

ఇంటర్నెట్‌: ఎథికల్‌ హ్యాకింగ్ అంటే మీకు ఆసక్తా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలిసారిగా యువ ఆవిష్కర్తల కోసం ఆధార్ హ్యాకథాన్‌ నిర్వహించనుంది. అక్టోబరు 28 నుంచి 31వ తేదీ వరకు దీనిని నిర్వహించనున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఇందులో జట్టుగా మాత్రమే పాల్గొనాలి. ఆసక్తిగలవారు ముందుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ పోటీలో పాల్గొని గెలిచిన మొదటి విజేతకు రూ.3 లక్షల నగదు, రెండో విజేతకు రూ.2 లక్షలు, మూడో విజేతకు రూ. లక్ష బహుమతిగా అందివ్వనున్నట్లు తెలిపింది.

‘‘ఆవిష్కరణ జీవనానికి ‘ఆధార్‌’లాంటిది. యూఐడీఏఐ హ్యాకథాన్‌ మీ కలలకు రెక్కలు జోడించబోతుంది. దేశం కోసం మీ మేధతో సమస్యలను పరిష్కరించి విజేతలుగా నిలవండి’’ అని యూఏడీఏఐ ట్వీట్ చేసింది. ఈ హ్యాకథాన్‌ను రెండు థీమ్‌లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటిది ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్, రెండోది ఐడెంటిటీ అండ్‌ అథెంటికేషన్‌. వీటితోపాటు ఆధార్‌ నమోదు ప్రక్రియలో, చిరునామా మార్చుకునే ప్రక్రియ, అడ్రస్‌ వెరిఫికేషన్, బ్యాంక్‌ ఖాతాలు తెరిచే వారికి వీడియో ఈకేవైసీ, థర్డ్‌పార్టీ యాప్‌లలో లావాదేవీల కోసం ఆధార్‌ ఉపయోగించడం, వంద శాతం ఆధార్‌ అథెంటికేషన్‌ వంటి సేవలను యూజర్స్ సులువుగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి పరిష్కారాలు కనుగొనేందుకు ఈ హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు యూఐడీఏఐ ట్విటర్‌లో పేర్కొంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనదలిచిన వారు https://hackathon.uidai.gov.in/లింక్‌పై క్లిక్ చేసి తమ టీమ్‌కి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న