Usain Bolt: బోల్ట్‌ కవల పిల్లల పేర్లు వింటే ఆశ్చర్యపోతారు!
close

Published : 21/06/2021 16:43 IST
Usain Bolt: బోల్ట్‌ కవల పిల్లల పేర్లు వింటే ఆశ్చర్యపోతారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగులు వీరుడు ఉసేన్‌ బోల్ట్‌. ఈ జమైకా స్ప్రింటర్‌కు కవల పిల్లలు పుట్టారు. వారిద్దరికీ విభిన్నంగా పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వైరల్‌గా మార్చేశారు. ఇంతకీ ఏం పేర్లు పెట్టాడంటే..!

అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా ఉసేన్‌ బోల్ట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. తన కవల పిల్లల పేర్లేంటో ప్రపంచానికి తెలియజేశాడు. అయితే, వారు పుట్టిన తేదీ మాత్రం వెల్లడించలేదు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. ‘ఒలింపియా లైటెనింగ్‌ బోల్ట్‌, సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌’ అని వ్యాఖ్య పెట్టాడు. ఆ ముగ్గురి పేర్ల పక్కన మెరుపు చిహ్నాలను ఉంచాడు.

అతడి సతీమణి కేసీ బెన్నెట్‌ సైతం ‘నా ప్రేమ.. ఉసేన్‌ బోల్ట్‌కు హ్యపీ ఫాదర్స్‌ డే. ఈ కుటుంబంలో నువ్వే ఒక రాక్‌స్టార్‌. మన చిన్నారులకు గొప్ప నాన్నవు. మేమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

బోల్ట్‌కు మొదట అమ్మాయి పుట్టింది. ఆమె పేరు ఒలింపియా లైటెనింగ్‌ బోల్ట్‌. ఈ మధ్యే మగ పిల్లలు పుట్టారు. వారే సెయింట్‌ లియో బోల్ట్‌, థండర్‌ బోల్ట్‌. మెరుపులు, ఉరుములకు చెందిన పేర్లు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు మీమ్స్‌తో అలరించగా మరికొందరు అతడికి అభినందనలు తెలియజేశారు. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో పతకాల పంట పండించిన అతడు 2017లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న