ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11తో వివో కొత్త ఫోన్‌..
close

Published : 11/01/2021 20:28 IST

ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11తో వివో కొత్త ఫోన్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివో కంపెనీ వై51ఏ పేరుతో కొత్త ఫోన్‌ని భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, పలుచని డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఉన్నాయి. గతేడాది డిసెంబరులో విడుదల చేసిన వై51 మోడల్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. దీని ధర...ఇతర ఫీచర్స్‌ ఏంటో ఒక్కసారి చూద్దాం..

వివో వై51ఏ ఫీచర్స్‌.. 

* 6.58-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

* ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11తో పనిచేస్తుంది.

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌ ఉపయోగించారు.

* వై51ఏలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. 

* వెనక వైపు 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 

* ఇందులో పొట్రెయిట్, ఫొటో, వీడియో, పనోరమ, లైవ్‌ ఫొటో, స్లో-మోషన్‌, టైమ్‌ లాప్స్‌, సూపర్‌ నైట్ మోడ్‌, ఏఐ ఫీచర్స్‌ ఉన్నాయి. 

* ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

* 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

* 8జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 17,990.

* టైటానియం సఫైర్‌, క్రిస్టల్‌ సింఫనీ రంగుల్లో లభిస్తుంది.

* వివో ఈ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పేటీఎం, టాటా క్లిక్‌ వెబ్‌సైట్లతో పాటు అన్ని రిటైల్‌ అవుట్‌లెట్లలో కొనుగోలు చెయ్యొచ్చు. 

ఇవీ చదవండి..

లావా ఫోన్‌: మీరు ఎలా కావాలంటే అలా

తక్కువ ధరకే 5జీ ఫోన్‌.. ఎప్పుడంటే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న