ఊసరవెల్లిలా ఫోన్‌ కూడా రంగులు మారిస్తే..?
close

Published : 06/09/2020 14:16 IST

ఊసరవెల్లిలా ఫోన్‌ కూడా రంగులు మారిస్తే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఊసరవెల్లి.. ఏ సమయంలో ఏ రంగు మార్చుకోవాలో దానికి బాగా తెలుసు. అయినా ఇప్పుడెందుకు అది గుర్తుకొచ్చిందంటారా..? వివో సంస్థ తీసుకొస్తున్న కొత్త ఫోన్‌ గురించి లెండి! ఇప్పటికే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ తమ కొత్త మోడల్‌ ఫోన్‌లో కెమెరాలు కనిపించకుండా చేయగలిగింది. ఫ్యాన్సీ గ్లాస్‌తో ఇలా చేసింది. ఇదే తరహాలో ఎలక్ట్రోక్రోమిక్‌ గ్లాస్‌ను వినియోగించి స్మార్ట్‌ఫోన్‌ రంగును మార్చేలా వివో కొత్త ప్రయోగం చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు భాగంలో ఈ రంగులు మారుతాయి. 

ఏడు లేయర్లు కలిగిన ఎలక్ట్రోక్రోమిక్‌ గ్లాస్‌ను టంగ్‌స్టన్‌ వంటి ఇతర లోహాలతో తయారు చేస్తారు. సూర్యకాంతి పడే ఒక్కో సమయంలో ఒక్కో రకమైన షేడింగ్‌ ఇవ్వడం వల్ల రంగు మారినట్లు అనిపిస్తుంది. వివో సంస్థ విడుదల చేసిన వీడియోలో ఫోన్‌ను అటూఇటూ కదిపితే రంగు మారుతూ ఉంటుంది. మార్కెట్‌లోకి రాబోతున్న ఈ తరహా ఫోన్‌ బహుశా ఇదే కావొచ్చు. అయితే దీని ధర అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రోక్రోమిక్‌ గ్లాస్‌ తయారీ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా జేబులో ఇలాంటి విభిన్న ఫోన్‌ ఉంటే ఆ కిక్కే వేరు మాస్టారు అంటారా? మరి అలాగే కానివ్వండి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదలవుతుంది? మన దేశ విపణిలోకి ఎప్పుడు వస్తుంది? అనే వివరాలను వివో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న