WhatsApp: కాల్ కట్‌ అయినా... సులభంగా ‘జాయిన్‌’ అవ్వొచ్చు!
close

Updated : 19/10/2021 20:05 IST

WhatsApp: కాల్ కట్‌ అయినా... సులభంగా ‘జాయిన్‌’ అవ్వొచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రూప్‌ వీడియో కాల్‌కు సంబంధించి వాట్సాప్‌ (WhatsApp) మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూపు వీడియో కాల్‌ (Group Video Call) నుంచి పొరపాటున, లేదంటే ఏదో కారణంతో... కాల్‌ కట్‌ చేసినవారు తిరిగి కాల్‌లో యాడ్‌ అవ్వొచ్చు. దీని కోసం జాయిన్‌ (Join) అనే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. వీడియో కాల్‌ కొనసాగుతున్న గ్రూప్‌లోకి వెళ్తే... పైన ఇన్ఫర్మేషన్‌ బార్‌లో జాయిన్‌ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి ఆ గ్రూప్‌ కాల్‌లో యాడ్‌ అవ్వొచ్చు.

గ్రూప్‌ వీడియో, ఆడియో కాల్స్‌ (Video & Audio Calls) రెండింటిలోనూ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రూప్‌ కాల్స్‌కు సంబంధింది వాట్సాప్‌ ఇటీవల కాలంలో చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది. కాల్‌ మధ్యలో గ్రూప్‌లోని వేరే వ్యక్తికి కనెక్ట్‌ చేసేలా ఇటీవల ఆప్షన్‌ తీసుకొచ్చారు. దీంతోపాటు కాల్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌ను కూడా మార్చారు. తాజాగా జాయిన్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న