వెబ్‌ వాట్సాప్‌: మరింత పటిష్ఠంగా..భద్రంగా.. 
close

Published : 28/01/2021 21:16 IST

వెబ్‌ వాట్సాప్‌: మరింత పటిష్ఠంగా..భద్రంగా.. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: డెస్క్‌టాప్, వెబ్‌ యాప్‌లకు వాట్సాప్‌ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ మేరకు వాట్సాప్‌ యూజర్స్ తమ ఖాతాలను వెబ్‌ లేదా డెస్క్‌టాప్‌లకు లింక్‌ చేయాలంటే ఇక మీదట ఫేస్‌, ఫింగర్‌ ప్రింట్ల ద్వారా తప్పనిసరిగా తమ గుర్తింపును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రెండు వారాల్లో ఈ ఫీచర్‌ యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్స్‌ ఫేస్‌, ఫింగర్‌ ప్రింట్ ఫీచర్ ద్వారా, ఐఫోన్ యూజర్స్‌ ఫేస్‌ ఐడీ ద్వారా తమ ఖాతాలను రూఢీ చేసుకోవాలి. యూజర్స్ తమ వాట్సాప్ ఖాతాలను లింక్‌ చేయాలనుకున్న ప్రతిసారీ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లో సెక్యూరిటీ వెరిఫికేషన్‌కు సంబంధించి పాప్-అప్ మెసేజ్‌ కనిపిస్తుంది. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఫోన్‌ నుంచి డెస్క్‌టాప్‌లో క్యూఆర్‌ కోడ్ స్కాన్‌ చేయాలి. అలానే మీ అనుమతి లేకుండా ఇతరులు మీ ఖాతాను యాక్సెస్‌ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. 

కొత్తగా తీసుకొస్తున్న సెక్యూరిటీ ఫీచర్స్‌ గురించి వాట్సాప్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేం తీసుకొచ్చిన ఫేస్, ఫింగర్‌ ప్రింట్ అథెంటికేషన్‌ ఫీచర్స్‌ గోప్యత ప్రమాణాలను మరింత మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడుతుంది. అలానే ఈ బయోమెట్రిక్‌ సమాచారాన్ని వాట్సాప్‌ యాక్సెస్‌ చేయలేదు’’ అని తెలిపింది. ఇటీవల వ్యక్తిగత గోప్యత సమాచారం విషయంలో వాట్సాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాట్సాప్‌ పలు మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చింది. తాము ఫేస్‌బుక్‌తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోమని స్పష్టం చేసింది.  అలానే వాట్సాప్‌ ఈ  కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌తో యూజర్స్‌కి మరింత చేరువకావాలని ఆశిస్తోంది.  

ఇవీ చదవండి..

భారత్‌లో తగ్గనున్న ఐఫోన్ ధరలు..

నకిలీలను పట్టేయండి.. యూట్యూబ్‌ యాప్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న