వాట్సాప్ కొత్త ఫీచర్..ఎప్పుడైనా లాగౌట్ కావొచ్చు
close

Published : 20/02/2021 00:05 IST
వాట్సాప్ కొత్త ఫీచర్..ఎప్పుడైనా లాగౌట్ కావొచ్చు

ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలే మల్టీ డివైజ్ సపోర్ట్, మెన్షన్ బ్యాడ్జ్‌ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా లాగౌట్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీని సాయంతో యూజర్స్‌ తమ వాట్సాప్‌ ఖాతా నుంచి ఎప్పుడైనా సైన్‌అవుట్ అవ్యొచ్చు. ఉదాహరణకు మీరు కొంత కాలం పాటు వాట్సాప్ ఉపయోగించకూడదనకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సైన్‌అవుట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

ఇప్పటి వరకు వాట్సాప్ నుంచి బ్రేక్ కోరుకునే వారికి యాప్‌ అన్‌-ఇన్‌స్టాల్ చేయడం లేదా ఖాతా డిలీట్ చేసే ఆప్షన్స్‌ మాత్రమే ఉన్నాయి. తాజా అప్‌డేట్‌ యూజర్స్‌కి మరింత ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న డిలీట్ అకౌంట్ స్థానంలో ఈ కొత్త ఫీచర్‌ను రానుంది. గత కొంత కాలంగా వాట్సాప్ యూజర్స్ నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్ బీటా (2.21.30.16.) యూజర్స్‌కి లాగౌట్ ఫీచర్ అందుబాటులో ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న