వాట్సాప్‌: ఒక్క టచ్‌తో ‘మ్యూట్‌’
close

Updated : 28/02/2021 17:06 IST
వాట్సాప్‌: ఒక్క టచ్‌తో ‘మ్యూట్‌’

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను ఆపే వెసులుబాటు ఉండేది కాదు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు. కొత్త వెర్షన్‌లో మ్యూట్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ యూజర్లకు యాడ్ చేసింది. దీని వల్ల అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కొంతమందికి వెర్షన్‌ అప్‌డేట్‌ అయినా, మరికొందరికి కొత్త అప్‌డేషన్‌ ఇంకా రావాల్సి ఉంది. 

ఎలా చేయవచ్చు...?

చాలా సులువుగా మ్యూట్‌ ఆప్షన్‌ను వినియోగించవచ్చు. ఏదైనా వీడియోను షేర్ చేసేటప్పుడు సౌండ్ సింబల్‌ కనిపిస్తుంది. దానిని సింపుల్‌గా మ్యూట్‌ చేసేస్తే రిసీవ్‌ చేసుకునే వారికి ఎలాంటి ఆడియో లేకుండా వీడియో వెళ్లిపోతుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో టెస్ట్‌ చేసి కొంతమంది వాట్సాప్‌ యూజర్లకు అప్‌డేషన్ కూడా వచ్చేసింది. అలానే కొత్తగా తీసుకురానున్న ప్రైవసీ పాలసీపై కూడా వాట్సాప్ బృందం కసరత్తు చేస్తున్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. 


మారనున్న షేరింగ్‌ లేఅవుట్‌..

మీడియా షేరింగ్‌ మెను లేఅవుట్‌ను మార్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో అప్‌డేట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పించింది. వీడియోలు, ఫొటోలు, జిఫ్‌లు షేర్‌ చేసేటప్పుడు టెక్ట్స్‌ మెసేజ్‌ ‘బెలూన్‌’ను ప్రత్యేకంగా రూపొందించింది. బెలూన్ అలైన్‌మెంట్‌ కూడా కాస్త చిన్నగా ఉండబోతుంది. రిసీవ్‌ చేసుకునే వారి పేరు పొజిషన్‌ కూడా మారనుంది. రిసీవర్‌ నేమ్‌ ఎడమ కింది భాగం నుంచి కుడివైపు అడుగున కనిపించనుంది. అయితే కొత్త ఫీచర్‌ ఎప్పుడు నుంచి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్‌ అధికారికంగా వెల్లడించలేదు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న