WhatsApp Disaapearing: ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వాట్సాప్‌ డిస్‌అపియరింగ్‌ ఫీచర్‌
close

Published : 03/09/2021 00:19 IST

WhatsApp Disaapearing: ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వాట్సాప్‌ డిస్‌అపియరింగ్‌ ఫీచర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది చివర్లో వాట్సాప్ డిస్‌అపియరింగ్ మెసేజెస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ పంపే మెసేజ్‌లు, ఇతరుల నుంచి యూజర్‌కి వచ్చే మెసేజ్‌లు వారం రోజుల తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. త్వరలో ఈ ఫీచర్‌ని వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో భాగం చేయనున్నట్లు సమాచారం. దీంతో యూజర్ పంపే ప్రతి మెసేజ్ ఇకమీదట వారం రోజుల తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్‌ అయిపోతాయి. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, వాట్సాప్  హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ ఒక సమావేశంలో వెల్లడించినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డిస్‌అపియరింగ్ ఫీచర్‌ కేవలం ఒక ఫీచర్‌లా మాత్రమే యూజర్స్‌కి అందుబాటులో ఉంది. అంటే యూజర్‌ ఫ్రొఫైల్ లేదా గ్రూప్‌ డిస్క్రిప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్‌ చేస్తే డిస్‌అపియరింగ్ అనే ఫీచర్ కనిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఇక మీదట ఆ ఫీచర్‌ సెట్టింగ్స్‌లో ప్రైవసీ సెక్షన్‌లో రీడ్‌ రెసిపెట్స్‌,  గ్రూప్స్‌ ఆప్షన్‌కి మధ్యలో ఇవ్వనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. త్వరలోనే ఈ ఫీచర్‌ని పరీక్షల కోసం ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి పరిచయం చేయనుంది. పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చాక నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్ డిస్‌అపియరింగ్‌ ఫీచర్‌కి కొత్తగా మరో రెండు ఆప్షన్లు జోడించనున్నట్లు తెలిపారు. ఒకటి 24 గంటల తర్వాత మెసేజ్‌ డిస్‌అపియర్‌ ఆప్షన్, మరోటి 90 రోజుల తర్వాత మెసేజ్ డిస్‌అపియర్‌ అయ్యే ఆప్షన్. ఇవేకాకుండా వాట్సాప్ వేవ్‌ఫార్మ్‌, మెసేజ్ రియాక్షన్, వెబ్‌ ప్రివ్యూ, డేటా ట్రాన్స్‌ఫర్ వంటి కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి పరిచయం చేయనుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న