WhatsApp Features Rewind: వాట్సాప్‌లోని ఈ ఫీచర్లు వినియోగించారా?
close

Published : 19/08/2021 01:32 IST

WhatsApp Features Rewind: వాట్సాప్‌లోని ఈ ఫీచర్లు వినియోగించారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ యాప్‌ను మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవడానికి వాట్సాప్‌ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తూ యూజర్లకు అందిస్తుంటుంది. ఇప్పటికే పేమెంట్స్‌ బ్యాక్‌గ్రౌండ్స్, చాట్‌ హిస్టరీ ట్రాన్స్‌ఫర్, వ్యూ వన్స్‌, రీజాయిన్‌ కాల్స్‌ వంటి ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ ఫీచర్లు ఎలా ఉంటాయో పరిశీలించారా..? వాటిని ఎలా వినియోగించుకోవాలో ఓసారి తెలుసుకుందామా..!

వెరైటీ థీమ్స్‌... 

భారతీయ వాట్సాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. వాట్సాప్‌ యూపీఐ ద్వారా బంధువులు, స్నేహితులు ఎవరికైనా నగదు పంపించొచ్చు. పేమెంట్స్‌ ఫీచర్‌కు అదనపు హంగును వాట్సాప్‌ జోడించింది. నగదు సెండ్‌ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సందర్భాన్ని బట్టి థీమ్స్‌ను పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీ ఫ్రెండ్‌కి బర్త్‌డే గిఫ్ట్‌ కోసం సొమ్ము పంపారనుకోండి.. పుట్టిన రోజుకు సంబంధించిన థీమ్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పంపే వీలును కల్పించింది. వ్యక్తిగత భావోద్వేగాలను తెలియపరిచేందుకు పేమెంట్స్‌ బ్యాక్‌గ్రౌండ్స్‌ ఫీచర్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్‌ పేర్కొంది. 
*
మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి

డేటా ట్రాన్స్‌ఫర్ 

ఐఓఎస్‌ డివైజ్‌లోని ఛాట్ డేటాను సులభంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి బదిలీ చేసుకునే అవకాశం యూజర్లకు కల్పించింది. గతంలో ఛాట్ డేటాను ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కి మార్చుకోవాలనుకుంటే థర్డ్‌పార్టీ యాప్‌లను ఉపయోగించడం లేదా క్లౌడ్‌లో బ్యాకప్ చేసుకుని కొత్త డివైజ్‌లోకి డౌన్‌లోడ్ ట్రాన్స్‌ఫర్ చేసేవారు. దీనివల్ల కొన్నిసార్లు డేటా లీక్ లేదా డిలీట్ అయ్యేది. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఛాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్‌కే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్స్‌కి అందరికీ అందుబాటులోకి రానుంది.
*
ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు

ఒక్కసారి చూసే ఫీచర్‌.. అలానే రీజాయిన్‌ కాల్స్‌

* సీక్రెట్‌, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను కావాల్సిన వారికి పంపించుకోవాలి. కాకపోతే అవి మరిన్ని సార్లు ఓపెన్‌ కాకుండా ఉండాలి. అలాంటి వారి కోసం వ్యూ ఒన్స్ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. మీరు పంపించిన ఫొటోలు, వీడియోలను రిసీవర్‌ ఒకసారి మాత్రమే చూడగలుగుతారు. తర్వాత అవన్నీ మాయమైపోతాయి. భలేగుంది కదూ ఈ ఫీచర్‌.. మరి మీరూ ఓసారి ట్రై చేయండి... పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

* అదేవిధంగా మీ స్నేహితులు, బంధువులు మీకు గ్రూప్‌ వీడియోకాల్ చేశారు.. ఆ సమయంలో మీరు బిజీగా ఉండటం వల్ల కనెక్ట్‌ కావడం కుదరలేదు. అయితే వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో మీరు ఎప్పుడైనా సరే వీడియో కాల్‌లో జాయిన్‌ అవ్వొచ్చు. కొద్దిసేపటి తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు గ్రూప్ కాల్ ఇంకా కొనసాగుతుంటే స్క్రీన్‌ మీద మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు ఆప్షన్లు  కనిపిస్తాయి. వాటిలో జాయిన్‌పై క్లిక్ చేసి గ్రూప్‌ కాల్‌లో జాయిన్ కావొచ్చు. గ్రూప్‌ వీడియో కాలింగ్ గురించి ఇంకా తెలుసుకోండి

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న