Whats App:వేరే నంబరుకూ చాట్‌ హిస్టరీ మార్చొచ్చు
close

Updated : 23/05/2021 16:38 IST
Whats App:వేరే నంబరుకూ చాట్‌ హిస్టరీ మార్చొచ్చు

త్వరలో అందుబాటులోకి తేనున్న వాట్సాప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌కు మారినపుడు వాట్సాప్‌ చాట్‌ హిస్టరీని బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. కానీ ఒక నంబరు నుంచి మరొక నంబరుకు మారినపుడు చాట్‌ హిస్టరీ మైగ్రేషన్‌ కుదరదు. వాట్సాప్‌ నంబరును మార్చిన ప్రతిసారీ చాట్‌ హిస్టరీ మొత్తం పోతుంది. కానీ త్వరలో వేరే నంబరుకు మారినపుడు కూడా చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకొనే అవకాశాన్ని వాట్సాప్‌ కల్పించనుంది. మన పాత నంబరులోని డేటాను కొత్త నంబరుకు బదిలీ చేసుకొనేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.

మరోవైపు ఎప్పటి నుంచో వినియోగదారులు ఎదురు చూస్తున్న అప్డేట్‌.. రెండు వేర్వేరు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఉన్న ఫోన్లలో చాట్‌ హిస్టరీ ట్రాన్స్‌ఫర్‌. ఐఓఎస్‌లో ఉన్న చాట్‌ హిస్టరీని ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోకి మార్చుకునేందుకు వీలుగా వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికంటే ముందే రెండు నంబర్ల మధ్య చాట్‌ హిస్టరీని మార్చుకొనే ఫీచర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. అయితే దీన్ని వినియోగించుకోవాలంటే ఒకరి వాట్సాప్‌ ఖాతాను ఫోన్‌కు లింక్‌ చేయాలి. తర్వాత చాట్‌ హిస్టరీ, మీడియా మొత్తం కొత్త నంబరులోకి మారిపోతాయి. ఈ ఫీచర్‌ను త్వరలో ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లోకి అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న