Xiaomi releases notebooks: ఎంఐ ‘నోట్‌బుక్’ ఫీచర్లు ఇవేనా?
close

Published : 18/08/2021 22:57 IST

Xiaomi releases notebooks: ఎంఐ ‘నోట్‌బుక్’ ఫీచర్లు ఇవేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా షావోమీ ఆగస్టు 26న తన కొత్త ఎంఐ నోట్‌బుక్స్‌ సిరీస్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనుంది. ‘స్మార్టర్‌ లివింగ్‌ 2022’ కార్యక్రమంలో విడుదల చేస్తామని ఇప్పటికే షావోమీ ప్రకటించింది. అమెజాన్‌ అధికారిక పేజీ ప్రకారం.. ఎంఐ నోట్‌బుక్‌ మోడల్ 16:10 సైజ్‌ డిస్‌ప్లేతో రానుంది. హయ్యర్ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేతో నోట్‌బుక్స్‌ను తీసుకువస్తామని ఇదివరకే షావోమీ వెల్లడించింది. 3020X2000 రిసొల్యూషన్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఎంఐ నోట్‌బుక్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను ఎంబేడ్‌ చేసిన పవర్‌బటన్‌తోపాటు బ్యాక్‌లిట్‌ కీబోర్డ్‌ ఫీచర్‌తో రానుంది. డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్‌ కోసం థండర్‌బోల్ట్‌ పోర్ట్‌ ఉండనుంది. 

మ్యాక్‌బుక్ డిజైన్‌ మాదిరిగానే షావోమీ MIనోట్‌బుక్‌ డిజైన్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎడ్జ్‌లో.. యూఎస్‌బీ పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్‌, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, థండర్‌బోల్ట్‌ పోర్ట్‌.. మరో ఎడ్జ్‌లో యూఎస్‌బీ పోర్ట్‌తో కూడిన 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉండనుంది. స్మార్టర్‌ లివింగ్‌-2022 ఈవెంట్‌లో షావోమీ ఎంఐ 14 సిరీస్‌లో రెండు నోట్‌బుక్స్‌ను విడుదల చేయనుంది. కొన్ని నెలల కిందట చైనాలో విడుదలైన రెడ్‌మీబుక్ ప్రో 14, రెడ్‌మీబుక్ ప్రో 15కు రీబ్రాడ్‌గా MI నోట్‌బుక్ ప్రో 14, MI నోట్‌బుక్ అల్ట్రా 14 సిరీస్‌ నోట్‌బుక్స్‌ భారత్‌లో లాంచ్‌ కాబోతున్నాయి. ఇంటెల్ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌ను వినియోగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కార్యక్రమంలో ఎంఐ బ్యాండ్‌ 6, వైఫై రూటర్, స్మార్ట్‌ కెమెరా ఉత్పత్తులను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న